🙏వాక్యము 🙏
ప్రభువైన క్రీస్తు నందు ప్రియమైన
సహోదరి సహోదరులారా ప్రభువు నామమున మీ అందరికి నా శుభాభివందనములు. గత కొన్ని నెలలుగా సమాధానము గూర్చి ధ్యానించుకొనుచున్నాము, అందులో దేవుని సమాధానము కలిగి ఉండాలంటే మనము ఏమేమి కలిగియుండాలో అని చెప్పుకున్నాము. వాటిలో గత మాసములలో విశ్వాసము ప్రార్థన వలన
సమాధానము గూర్చి ధ్యానము చేశాము. ఈ మాసము వాక్యము వలన సమాధానము గూర్చి ధ్యానిద్దాం.
దేవుని సమాధానము కలిగి ఉండాలంటే
1. విశ్వాసము- రోమ 5: 1 2.ప్రార్థన- ఫిలిప్పీ 4: 6,7 3. వాక్యం- యోహాను 16: 33 4. సహవాసము- యోబు 22: 21
5. హృదయ మందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుట- 1పేతురు 3:
15 6. దేవునిగూర్చి ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానము-2పేతురు 1: 3 7. సమస్తశిక్షయందు అభ్యాసము- హెబ్రీ
12: 11
సమాధానము
అనే ఆంశాన్ని మరోక సారి గుర్తు చేయలనుకుంటున్నాను, మన
చెడు జీవితం నుండి మంచి వైపు మరలుట లేక మొదటి స్థితి నుండి మారుమనస్సు పొందుట, మనకు
ఉన్నటువంటి వివాదములు విచారములు భయములు ఆగ్రహము మొదలగు స్వాభావిక లక్షణాలలో
నెమ్మది శాంతి పొందుకోవడం, మరియు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి
అవసరతలను దైవ జ్ఞానంను పొందుకొనుటయు మన జీవిత పరమార్థన్ని ఎరిగి దాని చొప్పున బ్రతుకును
ముగించుట సరియైన సమాధానము అని అర్థం చేసుకొనుడి. సమాధానముగా ఉండుటను వాక్యపు
వెలుగులో పరిక్షించుకొనుటలో భక్తి జీవితము ఎలాటిదో తేటతెల్లమవును. మనమందరము
వాక్యమనే అద్దమును కలిగియున్నవారమే కాని అద్దమును మనం చూసె దుమ్ము పట్టిన విధానము
మారాలి, అనగా వాక్యము ఎందుకు
వ్రాయబడెనో, వాక్యపు
విశిష్టతలు పోలికలు ఏమిటో, సరియైన భావం
గ్రహించుటకు వాక్యము పట్ల మన వ్యవహార శైలి ఎలా ఉండాలో అనే విషయాలు
ధ్యానించుకొందాము.
దేవుని
వాక్యము ఎందుకు వ్రాయబడెను? : కొన్ని మాటలు
చూద్దాం
_ వాక్యమును
బట్టి దేవుడు మనతో నిబంధన చేసియున్నందుకు- నిర్గమ 34:27
_ దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి
గైకొనుటకు భయపడుటకు- ద్వితి 28:58; 30:10
_ దేవుని ప్రజలకు
నేర్పుటకు, దేవునికి సాక్ష్యార్థముగా ఉండునట్లు కంఠాపాఠము చేయించుటకు- ద్వితి
31:19
_ యేసు దేవుని
కుమారుడని నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు
నిత్యజీవము పొందుటకు –యోహను 20: 30,31
_ దేవుని యందు భయభక్తులు
గల వారికి జ్ఞాపకార్థంగా ఉండుటకు – మలాకి 3: 16; రోమా 15:16
_ ఆదరణ, నిరీక్షణ మరియు
భోద కలుగు నిమిత్తము- రోమా 15:4
_ యుగాంతమందున్న మనకు
బుద్దికలుగుటకు- 1 కొరింథి 10:11
_ ప్రభువు యొక్క ఆజ్ఞలను
ధృడముగా తెలుసుకొనుటకు- 1 కొరింథి 14:37
_ వాక్యమును
ఒప్పుకొనుటకు- 2 కొరింథి 1:13
_ మనమన్ని విషయములలో విధేయులై
ఉన్నామో లేమో అని మన యోగ్యత తెలుసుకొనుటకు- 2 కొరింథి 2:9
_ క్రీస్తు పత్రికయై
యుండుటకు- 2 కొరింథి 3:2,3
_ జీవముగల దేవుని
సంఘములో జనులెలాగు ప్రవర్తింపవలెయునొ తెలియుటకు- 1 తిమోతి 3:15
_ దేవుని ధర్మవిధులు మన
హృదయములపై వ్రాయబడుటకు- హెబ్రీ 8:10
_ హెచ్చరిక పొందుటకు- హెబ్రీ
13:22; కీర్తనలు 19:11
_ పాపము చేయకుండుటకై- 1 యోహాను 2:1
_ మోసపరచు వారిని బట్టి
జాగ్రత్తగా ఉండుటకు- 1 యోహాను 2:26
_ దేవుని కుమారుని
నామమందు విశ్వసించు మనము నిత్యజీవము గలవారమని తెలిసికొనునట్లు- 1 యోహాను 5:13
_ గొర్రె పిల్లయొక్క జీవ
గ్రంథములో పేర్లు వ్రాయబడుటకు- ప్రకటన 13:8;20:12,15
_ ప్రభువునందు మృతినొందు
మృతులు ధన్యులనుటకు- ప్రకటన 14:13
_ గొర్రె విందుకు
పిలువబడిన వారు ధన్యులనుటకు- ప్రకటన 19:9
_ నమ్మకమును
నిజమునైయున్నవి గనుక వ్రాయబడెను – ప్రకటన 21:5
దేవుని
మాటల (వాక్యం) యొక్క విశిష్టతలు :
కీర్తనలు
19:7-11
¶ యదార్థమైనవి –
కీర్తనలు 33:4; సామెతలు 8:6,9; ప్రకటన 19:9
¶ నమ్మదగినవి- కీర్తనలు
33:4; 1 తిమోతి 1:15; ప్రకటన 21:5
¶ నిర్దోషమైనవి
¶ నిర్మలమైనవి/ పరిశుద్దమైనవి –
2 సముయేలు
22:31
¶ సత్యమైనవి – సామెతలు
8:7; యోహాను 17:17
¶ న్యాయమైనవి
¶ విస్తారమైన మేలిమి
బంగారు కంటెను కోరదగినవి
¶ జుంటితేనె ధారకంటేను
మధురమైనవి – కీర్తనలు 141:6
¶ పవిత్రమైనవి –
కీర్తనలు 12:6
¶ స్వచ్చమైనవి –
కీర్తనలు 119: 140
¶ నిత్యము నిలుచునది-
యెషయా 40:8; 1 పెతురు 1:24
¶ అధికారము గలవి- లూకా
4:32
¶ పూర్ణాంగీకార యోగ్యమైనది- 1 తిమోతి 1:15; 4:9
¶ సజీవమైనవి – హెబ్రీ 4:12
¶ బలము/ శక్తి గలది - హెబ్రీ 4:12
¶ నిత్య జీవమైనవి
– యోహాను 6:68
¶ దయగలవి – లూకా
4:22
¶ గతించనివి –
మత్తయీ 24:35
¶ సఫలపరచేవి – యెషయా
55:10,11
¶ నీతిగలవి –
సామెతలు 8:8
వాక్యము
యొక్క పోలికలు :
A ధాన్యము –
యీర్మియా 23:28 – ఆహారము
A అగ్ని –
యీర్మియా 23:29 – స్వచ్చమైనది, పవిత్రమైనది,
మష్ఠును తీసివేయునది
A సుత్తె -
యీర్మియా 23:29 – హృదయపు
కాఠిన్యమును తొలగించునది
A మేలిమి బంగారం
- కీర్తనలు 19:10- విలువైనది అన్నిటికంటే కోరదగినది
A జుంటితేనె ధార-
కీర్తనలు 19:10 – మధురమైనది, రుచిగలది
A దీపము –
కీర్తనలు 119:105 నడవడిక నేర్పుతుంది
A వెలుగు -
కీర్తనలు 119:105 – మార్గాన్ని
వెల్ల్డడిపరుస్తుంది
A హిమము - యెషయా
55:10 – చిగురింపజేయును
A రొట్టె - మత్తయి 4:4 – ఆకలి తీరుస్తుంది, జీవింపజేస్తుంది
A విత్తనము -
మార్కు 4: 4,14 -ఆత్మీయముగా
యెదుగుట
A నీరు - యోహాను 4:14; ఎఫెసి 5:26 – ఎన్నడు దప్పిక గొనరని, హృదయము శుద్ది చెసుకొనుట
A ఆత్మ ఖడ్గము - ఎఫెసి
6:17; హెబ్రీ 4:12- సాతానును వాని తంత్రములను యెదురించుట
A పాల - 1 పెతురు 2:3 –
అత్మీయతలో శిశువులైయున్న వారు యెదుగునిమిత్తము
A అద్దం - యాకొబు 1:23 –
అంతరంగాన్ని బయలుపరచేది/
సరిచేయునది
వాక్యం
పట్ల మన పాత్ర :
O వినాలి(Listen) : దేవుని
మాటలు వినుట వలన విశ్వాసము కలుగుతుంది, అది క్రీస్తును
గూర్చిన మాట వలన కలుగును (రోమా10:17). దేవుని మాటలు వినినప్పుడు జనులు మేమేమి
చేయవలెనని అడిగిరి(లూకా 3:10,12; అ.కా. 2:37). కొందరు దేవుని మాటలు వినినప్పుడు తమ
పాప స్థితిని గుర్తెరిగి భయపడి బట్టలు చింపుకొని ఏడ్చిరి(2రాజులు 22:11; నెహెమ్య 8:9; యీర్మియా 36:16), విధేయులమై యుందుమనిరి(నిర్గమ 24:7). ఆయన సన్నిధిలో తన జనులందరి యెదుట ఆయన
మాటలు వినిపింపవలెనని కోరుకొంటున్నాడు(ద్వితి 31:11) కావున దేవుని మాటలు వింటున్న
మనము మన స్థితిని అది తెలియపరుస్తుంది గనుక మనమేమి చేయవలెనో మనకు భోధిస్తుంది. మరి
మనము ఎలా వినాలి తెలివితో వినాలి, శ్రద్దతో వినాలి జనులు ఆ
విధముగా ఉదయము మొదలుకొని మధ్యహ్నము వరకు ఓపికతొ వినినట్లుగా చూస్తాము(నెహెమ్య 8:3).
ఆలాగున వినే చర్య నీవు చేస్తున్నప్పుడు నీ ప్రతి చర్య ఏమిటి. దేవుని మాటలకు నీలో
చలనం కలుగుతుందా? లేక మొద్దుబారియున్నావా? అలక్ష్యముగా ఉన్నావా? జాగ్రత్త చెవిటివాడవైనట్లు
ఉండవద్దు దేవుని ఉగ్రతను తాలలేవు ఇట్టి వారి పట్ల ఆయన మహా భయంకరుడు.ఆయన మాట విని
వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువాలని దేవుని చిత్తము. వినువాడు ఊరకనే
వినుట వలన లాభమేమి? దానిని
వాక్యపు వేలుగులో పరిశీలించి అది ఎట్టిదో వివేచించి జ్ఞానాభ్యాసము చేయుచు
ఉత్తమమైన దానిని చేయ అలవర్చుకొనుట ఎంతైన మంచిది. దాచబడిన వెండిని బంగారములను వెదకునట్లు
వినునప్పుడుగాని చదువునప్పుడుగాని ధ్యానించునప్పుడుగాని వెదకుట దానిని వ్రాసుకొనుట
నేర్చుకొనుట గైకొనుటను బట్టి మనము సత్యమును(దేవుని) ఎంతగా ప్రేమించుచున్నామో ఆలోచన
చేసుకొనవచ్చును. ఆయన మాట వినువారు ధన్యులు, వాటిని గైకొను(అనుసరించు)
వారు మరి ధన్యులు.
§ చదవాలి(Read) : దేవుని
యొక్క మాటలను మనం ఎందుకు చదవాలో చాలా చక్కగా చెప్పబడింది, ద్వితి 17:20 లో ధర్మమును విడచిపెట్టి కుడికి గాని
యెడమకు గాని తొలగక యుండునట్లు దేవునికి భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని
కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు మనము మన బ్రతుకు దినములన్నిటను గ్రంథమును
చదువుచుండవలెనని స్పష్టంగా చేప్పబడింది. యెహొషువ సర్వసమాజము యెదుట స్త్రీలును
పిల్లలును వారి మధ్యనుండు పరదేశులును వినుచుండగా దేవుని మాటలన్నిటిలో ఒక్క
మాటయైనను విడచిపెట్టక చదివి వినిపించాడు, ఎందుకంటే దేవుని ప్రతి మాటలనుండి మనము ఏమియు
తీసివేయడానికి కలుపడానికి వీలులేదు(ద్వితి 12:32; ప్రకటన
22:19) ఇది బహు కఠినమైన ఆజ్ఞ. దేవుని కట్టడలను మార్చుట వలన లోకం అపవిత్రమవును(యెషయా
24:5), వాక్యమును బట్టి మనం పవిత్రులు కాగలము. చదువువాడు ధన్యుడు(ప్రకటన 1:3). ఈ
మాటలు ఎవరికి అవసరం అందరికి అవసరమే అందుకనే 2 రాజులు 23:1,2
లో రాజు యుదా యెరూషలెము వారిని పెద్దలందరిని కాపురస్తులందరిని యాజకులను ప్రవక్తలను
అల్పులను ఘనులను జనులనందరిని పిలుచుకొని దేవుని మందిరమునకు వచ్చి వారు వినుచుండగా
గ్రంధములోని మాటలన్నిటిని చదివించాడు. దేవుడు
మనము చదవాలని ఎంత కొరుకుంటున్నాడు అంటే మనం పరుగెత్తుచూ చదువ వీలగునట్లు
స్పష్టముగా వ్రాయుమని తన ప్రవక్తకు ఆజ్ఞాపిస్తున్నాడు (హబక్కూకు 2:2). దేవుని
గ్రంథమును స్పష్టముగా చదువుట మాత్రమే గాక జనులు దానిని బాగుగా గ్రహించునట్లు
అర్థము చేసుకొనవలేయును చెప్పవలెయును(నెహెమ్య 8:8). మన ప్రభువు భూ లోకంలో
ఉన్నప్పుడు తనను శోదిస్తున్నవారికి జవాబుగా దావిదు చేసిన దాని గూర్చి చదువలెదా? మీరు ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్నది చదువలేదా? మీరు
లెఖనములలో ఎన్నడును చదువలేదా? అని ప్రశ్నించినట్లుగా
చూస్తాం. ఆధ్యాత్మిక జీవితంలో అనుదినము జీవితకాలమంతయు దేవుని గ్రంథమును
చదువుచుండాలి అప్పుడు అన్నింటి గూర్చి ఎరిగిన వారముగా ఉంటాము. ఎలా చదువాలి పరిశిలించి చదువాలి (యెషయా 34:16). సంఘాలలో
ప్రతి విశ్రాంతిదినమున దేవుని మాటలు చదువుట వలన మునుపటి తరములనుండి దైవ నియమమును
ప్రకటించువారు ప్రతి పట్టణములో ప్రతి స్థలములలో ఉన్నారు ఉందురు(అ.కా. 15:21). చదువుట
వలన ఆదరణ సంతోషం కలుగుతుంది(అ.కా. 15:31). వాక్యమును మనము పూర్తిగా చదువుకొని
గ్రహించి వాటిని కదవరకు ఒప్పుకొవాలి(2 కొరింథి 1:13). చదువునప్పుడు హృదయమునకు ఉన్న
ముసుగు తొలగించుకోవాలి తొలగించబడాలి(2కొరింథి 3:15,16). చదువడం
ద్వారా దైవ జ్ఞానోదయం కలుగును ఇందునుబట్టె పౌలు
పత్రికలను చదివి వినిపించమని ఆనబెట్టుచున్నాడు, చదివించుకొమని చెప్పుచున్నాడు(కొలొస్సి 4:16; 1థెస్స 5:27). మంచి పుస్తకాలు చదవడం అనేది మంచి
స్నేహితుడుని పొందుకోవడం అయినప్పుడు ఇది దైవ గ్రంథం దీనిని చదవడం అనేది దేవునితో
స్నేహించడం అవుతుంది.
? వ్రాసుకొనాలి(Write) : వ్రాయబడుట,వ్రాసుకోనుము,వ్రాయుము ,ముద్రింపుము మరియు లిఖించుము అనే పదాలను బైబిల్ గ్రంధంలో మనం
గమనించినట్లైతే పాత నిబందన గ్రంధంలో 22 పుస్తకములలోను ,క్రొత్త నిబందన
గ్రంధంలో 27 పుస్తకములలో మొత్తం 279 అధ్యాయాలలో 456 సార్లకు పైగా కనబడుతునట్లుగా చూడవచ్చును. బైబిల్ గ్రంధంలో ఇన్ని సార్లు కనబడుతున్నదంటే ఎంత ప్రాముఖ్యమైన మాటో మనం అర్ధం చేసుకోవాలి. మొదటగా వ్రాయబడుట అనే మాటను నిర్గమ 17:14లో చూడవచ్చును, అక్కడ దేవుడు మోషేతో నేను జరిగించు కార్యం గురించి వ్రాసి వినిపించుము
అని చెపుతున్నాడు. ఆలాగున నిర్గమ 24:4లో మోషే దేవుని మాటలన్నింటిని వ్రాసి ప్రజలకు వినిపించినట్లుగా చూస్తాము. మరి
ప్రాముఖ్యంగా నిర్గమ 24:12,31;31:18;32:15,16లలో మహోన్నతుడైనటువంటి దేవుడే మానవ జీవితాలను క్రమ పరచేందుకు తానే స్వయాన
తన స్వహస్తాలతో వ్రాసి ఇస్తునట్లుగా చూడవచ్చును. దేవుని వాక్యంను వ్రాసుకోనుటకు
విసుగు చెందకూడదు, నిర్గమ 34:1 నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల
మీద వ్రాసెదను. దేవాతిదేవుడు మానవులను క్రమపరచుటకు ఎంత శ్రద్ధ ప్రేమ చూపుతున్నాడో
ఇక్కడ మనకు అర్ధం అవుతుంది.
దేవుడు తాను వ్రాసిన ఆజ్ఞల పలకలు
పగిలిపోయినప్పుడు మరియొక పలకపై ఆయన మరల వ్రాసి
ఇస్తాను అంటున్నాడు. మన జీవితాలను వెలిగించడానికి
తనకు ప్రత్యేకించబడిన ప్రజలుగా ఉండటానికి ఆయన వ్రాయుటకు విసుగు చెందనివాడు. వాటిని
మనం విని చదువుకొని ధ్యానించి వ్రాసుకొని కంఠపాఠముచేసుకొని
గైకొనుట వలన మనకు ఎంతో మేలు చేయనుద్దెశించి యున్నాడు.
దేవాతి దేవుడు ఆనాటి కాలములోనే తన ఆత్మ ప్రేరెపణ ద్వారా అనేకుల చేత జీవం గల తన వాక్కును
వ్రాయించడం వలన ఆ పత్రులు మనదాక వచ్చాయి. మలాకి 3:16; యోహాను 20:30,31; అ.పొ కార్యం 1:1,2;15:4; రోమ 15:4; 2కోరింథు 3:2,3;
2పేతురు1:21 లలో మనం తేటగా
గమనించవచ్చు. అవి నేటికి మనకు ఎంతో జీవధాయకంగా ఉన్నాయీ, నిజానికి క్రీస్తు రక్షణ
వెలుగులోనికి మనము ఎలా నడిపించబడ్డాము, వ్రాయుట అనే శ్రేష్టమైన కార్యం ద్వారా దేవుడు నేటికి తన ప్రేమ
చేత రక్షణను ప్రకటిస్తూ వ్యాక్యరూపిగా మనమధ్య నివసిస్తున్నాడు. ఇంకా గమనిస్తే మన ప్రభువైన క్రీస్తు(యోహాను 8:6-8) కూడా తన వ్రేలితో వ్రాస్తున్నట్లుగా గమనించగలము, క్రీస్తు
కలిగిన ఆ గుణం మనము కలిగి ఉందాము. ద్వితి11:18-20 లో దేవుని మాట సెలవిస్తునట్లుగా మనము ఆయన మాటలను మన హృదయములలోనూ
మనస్సులోను ఉంచుకొని వాటిని చేతులమీద సూచనులుగా కట్టుకోవలెను, అవి మన కన్నుల నడుమ భాసికలుగా ఉంచుకొనవలెను, ఈ వాక్యం యొక్క భావం దేవుని మాటలను మరువకూడదు
ఎల్లప్పుడూ అన్ని సందర్బాలలో అన్ని సమయాలలో అందరూను దైవ వాక్కును ధ్యానించాలి కళ్ళ
యెదుట ఉండాలి ఆ విధముగా వాటిని ప్రేమిస్తూ కట్టడలను విధులను అనుసరించి నడచుకోవాలనేది
దేవుని చిత్తమునైయున్నది.
మన ప్రభువైన
క్రీస్తు సాతాను చేత శోదించబడుచున్నప్పుడు సాతనుకు సమాధానంగా వ్రాయబడియున్నది గదా
అని చెప్పినట్లుగా చూస్తాం. ఈ విధముగా మనం వాక్యానుగునంగా నడచుట అనుసరించుట
వాక్యమును ఎత్తిపట్టుట వలన శోధనలను జయించగలము. దానికి మనం ఏంచెయ్యాలి అంటే వ్రాయబడిన దేవుని
మాటల పట్ల మన పాత్రయందు శ్రద్ద కలిగియుండి, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాక్యపు వెలుగులో పరిశీలించుకొని
ముందుకు సాగాలి. మనం భోదించే సందర్బం వచ్చినప్పుడు ముందుగా సిద్దపాటుగా ఏ
వర్తమానము చెప్పదలుచుకున్నామొ వాటిని వ్రాసుకొంటాము, లేదంటే సరిగా బొదించలెము చాలా వరకు మర్చిపొతాము. ఒక సందర్బంలోనే
వ్రాసుకొనుట అంత ప్రాముఖ్యమైనప్పుడు మన అనుదిన వాక్యధ్యానంలో ఎందుకు ఈ పని చేయము.
ఇదే నువ్వు వ్రాసుకున్న వాక్య ధ్యానము నీ కుటుంబానికి లేక తోటి వారికి సహకారముగా
ఉంటుంది. దేవుని వాక్యమును నీ తరువాత కూడను వారికి పంచినవాడవవుదువు. మరి విశేషంగా
నీవు నీ నడవడికను సరిచెసుకొని ఈ యాత్ర జీవితమును చక్కగా ముగింతువు. అది ఎంతో భాగ్యవంతమైనది.
అయితే కొందరు హృదయ మందు వ్రాసుకొంటారు అదే ప్రతి విశ్వాసి ఆలాగుననే ఉండాలని దేవుడు
కోరుకుంటున్నాడు. అయితే వారి హృదయాన ఉన్న అర్థవంతమైన మాటలు ఇతరులకు అందించబడాలంటే అవీ
తప్పక వినిపించబడాలి భోదించబడాలి ప్రాముఖ్యంగా అవి వ్రాయబడినట్లేతే మరిన్ని కాలలు
మరిన్ని ప్రదేశాలు వ్యక్తులకు దైవ వాక్కును సరిగా అర్థము చేసుకోవడానికి ఎంతగానో
తొడ్పాడుతాయి.
C నేర్చుకోవాలి(Learn) : దేవుడు తన స్వరూపమునకు
మనలను మార్చాలని అయన చిత్తమైయున్నది. అనగా ఆయన ఏమై ఉన్నాడో పరిశుద్దత
నీతి న్యాయం మొదలగు గుణలక్షణాలు మనము
కలిగిఉండాలని ఆయన సంకల్పం. తన స్వరూపమునకు మనలను మార్చుటకు ఆయన మనకు అనుగ్రహించిన
మాటలను మనము నేర్చుకోవాలి అలవర్చుకోవాలి. దేవుని వాక్కు మన యొద్దకు రావడం ఇది దేవుని
కృప ఇందులో ఒక ప్రధానమైన ఉద్దెశ్యం ఉన్నది. దానిని నేర్చుకొనుట గ్రహించుకొనుట అనేది
అభివృద్దికి సూచన, అయితే ఈ అభివృద్ది అందరికి కనబడాలి అంటే
క్రియలు తప్పనిసరి, అనుసరించడం అనేది లేనప్పుడు అది ఎంత
నేర్చుకున్న పనికిరానిది అవుతుంది. బైబిలులో అనేక వచనాలు నేర్చుకొనుడి నేర్పుడి
అనే మాటలను చూస్తాము. ప్రాముఖ్యంగా ద్వితీయొపదేశకాండములో వాక్యము వినడం చదవడం
వ్రాసుకోవడం నేర్చుకోవడం ధ్యానించడం గైకొనడం ప్రకటించడం వంటి విషయాలు దేవుని
వాక్యం పట్ల మన పాత్రను తెలియజేస్తున్నాయి. అందులోనుండి కొన్ని మాటలు చూద్దాం.
ద్వితి 4:10; 14:23 లో బ్రతుకు దినములన్నియు భయపడ నేర్చుకొని,
తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదనని దేవుడు
చెప్పియున్నట్లుగా గమనించవచ్చును. నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను
విధులను విని వాటిననుసరించి నడువుడి(ద్వితి 5:1). దేవునికి భయపడి వాక్యములన్నిటీని
అనుసరించి నడువనేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును
చదువుచుండవలేయును(ద్వితి 17:20). దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరు పురుషులేమి స్త్రీలేమి
పిల్లలేమి, మధ్య ఉన్న పరదేశులేమి అందరును నేర్చుకోవాలి
అందుకు వారిని పొగుచేయాలి(ద్వితి 31:12). ఎందుకు నేర్చుకొనవలెయును అనగా రాబోవు వారికిని దేవుని యెరుగని సంతతికిని నేర్పించుట
అనేది దానియొక్క రెండవ కొన అందును బట్టియె రాజుయైన ప్రతీ వాడును తనకొరకు ఒక దైవ
గ్రంథము వ్రాసుకొనమని దేవుని హెచ్చరికగా చెప్పబడింది. ఇంక దావీదు, దేవుని కట్టడలను నేర్చుకొనుటకు శ్రమపడటం మేలు కరమైనదని తన అనుభవాన్ని తేలియజెస్తున్నాడు.
మరియు ప్రభువైన యేసు క్రీస్తు వాక్యభావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకోండని చెప్పిన
సందర్బమును (మత్తయి 9:13) గమనించవచ్చును. పౌలు లేఖనముల యందు వ్రాసియున్న సంగతులను
అతిక్రమింపకూడదని నేర్చుకొనుడని చెప్పుచున్నాడు (1కొరింథి 4:6). మరియు అందరును
నేర్చుకొనునట్లు అందరును హెచ్చరికపొందునట్లు మనమందరము ఒకరి తర్వత ఒకరము భోదించుకోవాలి
(1కొరింథి 14:31) ఆవిధముగా దైవ వాక్యమును పరిపరి విధములగా భోదపరచుకొవలయును.
< కంఠాపాఠము
చెయ్యాలి(by heart ) : దైవ
వాక్కు సమస్త సృష్టిని కలుగజేసినటువంటి ఊహకు అందనటువంటి అద్బుతమైన శక్తి గలది, అది
పరిశుద్దమైనది న్యాయమైనది నీతిగలది జీవాహారమైయున్నది పరమునకు మార్గమైనయున్నది
సరిచెయునది ఖండించునది చిగురింపజేయునది మొదలగునవిగా చూడవచ్చును అటువంటి వాక్యము
మనం కంఠాపాఠము చేసినప్పుడు మన జీవనయానంలోని సుందరత ప్రశాంతతను సమయోచితమైన ఆలోచనలను
ఇస్తుంది. మన అనుదిన పనులలో దిశానిర్దేశం చేస్తుంది. కీర్తన వ్రాసి తన జనులకు నేర్పుమని అది ప్రజలలో నాకు
సాక్ష్యార్దంగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయుంచుమని దేవుడు
ఆజ్ఞాపిస్తున్నాడు(ద్వితి 31:19) కనుక అది ఇశ్రాయేలీయులకే చెప్పినను అత్మీయంగా మనకును
వర్తించును. కాబట్టి వ్యాక్యమును కంఠాపాఠము చెయ్యాలని దేవుడు మనకు
చెప్పకనే చెపుతున్నాడు.
ధ్యానించాలి(Meditate) : దేవుడు యోహోషువతో పలుకున్న తొలి పలుకులు, ధర్మశాస్త్రమును నీవు భోదింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు
నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించాలి ఆలాగు చేసినయెడల నీ మార్గమును
వర్థిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించెదవని(యోహోషువ 1:8), ధ్యానించడం ఎందుకో దాని వలన వచ్చే లాభమును
తెలియపరచాడు. (కీర్తన 1:1) యెహోవ ధర్మ శాస్రమందు ఆనందించుచు దీవారాత్రము
దానిని ధ్యానించువాడు ధన్యుడు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకోని రాత్రి
జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి
గానము చేయుచున్నదని(కీర్తనలు 63:4,5) దేవుని మాటలను ధ్యానించడం వలన కలిగె అనుభవాన్ని
తేలియపరస్తున్నాడు. దేవుడు చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను
నేను మనసునకు తెచ్చుకొందును, నీ కార్యములంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను
ధ్యానించుకొందును(కీర్తనలు 77:11,12). నీ ఆజ్ఞలను కట్టడలను
ఉపదేశమును ధ్యానించుకొందును, నీవిచ్చిన వాక్యము ధ్యానించుకొనుటకై నా కన్నులు రాత్రిజాము కాకమునుపే
తెరచుకొందును అని దావిదు తన యొక్క
ఆశను వ్యక్తపరుస్తున్నాడు. దావిదు దేవుని యొద్ద అడిగిన ఒక్క వరము దేవుని
ప్రసన్నతను చూడలని ఆయన ఆలయములో ధ్యానించడానికి
జీవిత కాలమంతయు నివసింపకోరుచున్నాను(కీర్తన 27:4), అనే తన బలమైన కోరికను కోరినట్లుగా
మనము కోరుచున్నామా?. దేవుని
మాటలు ధ్యానించునప్పుడు హృదయము మండును ఆత్మ వెలుగును మన
అభివృద్ది అందరికి తేటగా కనబడును.
Y హృదయములో నివసింపనియ్యాలి(Dwell the word in
Heart) : మనుష్యుడు అపవిత్రడయ్యెది హృదయములో నుండి వచ్చు వాటి వలనని
ప్రభువు చెప్పిన మాటలను(మార్కు 7:20-23) వినియున్నాము కావున మన హృదయములలో
ఎప్పుడైతే దేవుని వాక్యంను మన హృదయంలో నివసింపనిస్తామో అప్పుడు మనము
పవిత్రపరచబడతాము. ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబందన ఇదే నా ధర్మములను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని
వ్రాయుదును(హెబ్రీ 10:16), పాత నిబంధన
కాలంలో చేతికి కట్టుకోమని నుదుట ఉంచుకోమని గవునులపై వ్రాసుకోమని చెప్పేను గాని
దేవుని నూతన నిబంధన క్రీస్తులో మన హృదయముపై వ్రాయుట. నా దేవా నీ చిత్తము
నేరవేర్చుట నాకు సంతొషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నదన్న దావిదు దేవుని
పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తున్నది(కీర్తన 40:8). వాక్యమును మనము ఎరితిగా
ప్రేమిస్తున్నాము? దేవుని మాటల కొరకైన తృష్ణ మనలో ఉందా? మరియు ఈ యుగములో దేవుడు మన హృదయములపైన తన మాటలను వ్రాయాలని
ఆశపడుతున్నాడు,మరి దేవుని వాక్యము నీ హృదయములో వ్రాయబడుతూ ఉన్నదా?.
గైకొనాలి(Follow) : దేవుని
యొక్క ఆజ్ఞలను
కట్టడలను గైకొనడము అనేది దేవుని మనము ప్రేమించడము, ఇందును బట్టి దేవుని ఎంతగా
ప్రేమిస్తున్నామో అనేది బహిర్గతమవుతుంది(1 యోహను 5:3). దేవుని మాటలను విని పూర్ణ హృదయముతోను
పూర్ణ ఆత్మతోను దేవుని వైపు మళ్ళునప్పుడు ఆయన మన యందు ఆనందించి మనకు మేలు చేయునట్లు
మన వైపు మళ్ళే దేవుడుగా ఉన్నాడు(ద్వితి 30:10). దేవుని మాటలను మనము గైకొనునప్పుడు
ఆయన మనలను దీర్ఘాయుష్మంతులనుగా చేయును, చేసిన వాగ్దానమును
స్థిరపరచును, ఆయన మందిరముపై అధికారిగా నియమించి ఆయన
ఆవరణములను కాపాడువారుగా చేయును, మరింత విశేషమైనదిగా ఆయన
సన్నిదిలో నిలిచే భాగ్యమిచ్చును, సున్నతిలేని వారమైనను సున్నతిగల
వారముగా ఎంచబడుదుము, ఆయనను యెరిగియున్నామని తెలిసుకొందుము, ధన్యులముగాను మరి ధన్యులముగా తీర్చబడుదుము, దేవుని
దూతలతో సహ దాసులుగా ఎంచబడుదుము, దేవుని చిత్తమును నేరవెర్చిన
వారమవుదుము అందువలన మనకు నిత్యజీవము పరలోకము దేవునితో సహ నివాసము మరెన్నో
ఊహించలేని ఆశ్చర్యకరమైన దీవెనలు ఆశీర్వాదాలు ధన్యతలు ఆయన కృప వలన మనకు
అనుగ్రహింపబడును(1రాజులు 3:14; 6:12; జెకర్య 3:7; లూకా 11:28; రోమా 2:26; ప్రకటన
1:3; 22:7-9). బలులు
అర్పించుటకంటెను ఆజ్ఞను
గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము(1 సమూ 15:22),
ఇక్కడ గైకొనుట మాటవినుట అనేవి పాటించుట నడచుట అనుసరించుట అనే భావం.
భోదించాలి(Teach), ప్రకటించాలి (Preach) : దేనినీ ప్రకటించమని చెప్పబడింది? యేసుని గూర్చి, యేసు క్రీస్తు ప్రభువని రక్షకుడని, మన కొరకై
సిలువవేయబడ్డాడని, ఆయన వలన పాప క్షమాపణ కలుగుచున్నదని,
పరమునకు మార్గము క్రీస్తేయని, మారుమనస్సు
పొందవలెనని, దేవుని రాజ్య సువార్త, క్రీస్తు
మృతినోంది తిరిగి లేపబడ్డాడని, యేసు క్రీస్తును బట్టి మృతులకు
పునరుత్థానము కలుగునని, దేవుని కుమారుడైన క్రీస్తునందు విశ్వాసముంచిన వారు
నీతిమంతులుగా తీర్చబడురనియు, క్రీస్తును గూర్చిన సువార్త వలన
గొప్ప రక్షణ నిరిక్షణ యున్నదని, ఆత్మ విషయములో దేవుని బట్టి
జీవించుటను, రాబోయే దేవుని తీర్పును ప్రకటించాలి. ఏ విధముగా ప్రకటించాలి? శుద్దమనస్సుతో, ప్రేమతో, రాత్రింబగళ్లు
కష్టముచేసి జీవనము చేయుచు, శరీర దౌర్బల్యము కలిగినను మంచి
బుద్ది చేత, స్థిర విశ్వాసము గల వారమై, ధైర్యము తెచ్చుకొనుచు, హెచ్చరించుచు, మనలను మనము తగ్గించుకొనుచు పరిశీలించుకొనుచు, ఆశ
ఆసక్తితో ప్రకటింపవలెయును. మొదటి అపొస్తలులు క్రీస్తు భోధతో యేరూషలేమును
నింపినట్లుగా మూల మూలలకు ఈ సువార్త చాటింపబడాలి. దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము
పాటుపడటం దేవుని పిల్లలుగా మన ప్రాథమిక అత్యవసర పనిగా అభివర్ణించవచ్చు, అట్టి పని చేయువారు ధన్యులు వారిని బట్టియేగా ఈ మాటలు వ్రాయబడెను సువార్త
ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవి (రోమా 10:15).
వాక్యం
పట్ల మన పాత్రను పొషిస్తున్నాప్పుడు మన స్థితిని గుర్తెరుగుతూ మూలపాఠములనే కాక వివేచన
కలిగిన వారివలే బలమైన ఆహారమును అపేక్షించుదము. సంఘములోను సమాజములోను వాక్యంను
వక్రీకరించేవారు ఏంతో మంది బయలుదేరి యుంటుండగా ఆ దైవ వాక్కు ఎగగిన వారుగా మనము
దైర్యంగా నిలబడాలంటే వాక్యం పట్ల నిజముగా మనము ఇట్టి పాత్ర కలిగియుండ
బద్దులమైయున్నాము.
వారు దానిని చసువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. అ. పో.
15:31
No comments:
Post a Comment