Wednesday, 15 May 2019


🙏 ప్రార్థన 🙏
            గత రెండు మాసములుగా సమాధానము గూర్చి ధ్యానించుకొనుచున్నాము, అందులో దేవుని సమాధానము కలిగి ఉండాలంటే మనము ఏమేమి కలిగియుండాలో అని చెప్పుకున్నాము. వాటిలో గత మాసములో విశ్వాసము వలన సమాధానము గూర్చి ధ్యానము చేశాము. ఈ మాసము ప్రార్థన వలన సమాధానము గూర్చి ధ్యానిద్దాం.
దేవుని సమాధానము కలిగి ఉండాలంటే
1. విశ్వాసము        2.ప్రార్థన      3. వాక్యం     4. సహవాసము    5. హృదయమందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుట
6. దేవునిగూర్చి ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానము   7. సమస్తశిక్షయందు అభ్యాసము 
  ప్రతి విశ్వాసి జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనపాత్రను పొషిస్తుంది.ప్రార్థనలేని విశ్వాసి విశ్వాసియే కాడు ఎందుకంటే ప్రార్థన దేవునితొ సంభాషణ అది దేవునితొ సంబందనికి రుజువు. విశ్వాసించిన ప్రతి క్రైస్తవుడు దేవునితొ సంభాషించకుండ బ్రతుకలెడు. దేవునికి ప్రార్థించుట/ సంభాషించుట వలన తన విశ్వాసమును వేళ్ళడిపరచును. విశ్వాసికి ఆధారం దేవుడే గనుక మన అనుదిన జీవితంలో దేవునితొ ముచ్చటించుటయే సమాధానము భద్రత మేలుకరము. ప్రార్థన మనలను దేవునికి దగ్గరగా నడిపిస్తుంది, పరిశుద్దత వైపు పరుగులెత్తిస్తుంది. పరిశుద్దత ఫలితమే నిత్యజీవము అని దాని కొరకే మనము దేవుని చెత పిలువబడినవారమని, పరిశుద్దులముగా జీవించుట ఏలాగుననొ ఎరుగి వాటి చొప్పున నువ్వు నేను నడచుటయే దేవుని చిత్తమని బైబిలు మనకు స్పష్ఠముగా భొదిస్తుంది. దేవునితొ మాట్లాడితే ఆయన మనలను పరిశిలించి పరిక్శించి తనకు దగ్గరగా చెరుచుకొంటాడు. మన అత్మీయ జీవితంలో ప్రార్థన అనేది దేనితో సరిపోల్చలేని శక్తివంతమైన ఆయుదం.
          ప్రార్థించుట అనేది దేవుని క్రుపా సింహసనము నొద్దకు చెరుట అది ఒక ఎత్తైన శిఖరం దానిపైకి ఎక్కి మొరపెట్టిన మొర విన్నవించిన విన్నపము దేవుని యొద్దకు చేరును అర్పించి స్తుతి అర్పణ  క్రుజ్ఞాతార్పణ ఆరాధనను దేవుడు స్వికరించును. అందును బట్టి నిన్ను దివించును అశిర్వాదించును అందుకనే ఆ పరిశుద్ద శిఖరమును కావలికొటను ఎక్కుటకు ప్రయాసపడుము ప్రభువు ఉత్తరమిచ్చునంత వరకు కనిపెట్టుకొనియుండుము. ఇట్టి అభ్యాసము కలిగియుండుము అప్పుడు నీకు అన్నింటిలో సమాధానము దొరుకును.
ప్రార్థన ఒక ఆజ్ఞ:- దేవుని మాటలు ఇవిధముగా ఉన్నది నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను అని ఇందులో అయనకు ప్రార్థించవలెనను ఆజ్ఞ స్పష్టముగా కనపడుచున్నది. దేవుడు మనకు దొరుకు కాలములోనే  ఆయనను వెదకవలెనని సమీపములో ఉండగనే వేడుకొనవలెయుననియు తండ్రియైన దేవుడు కొరుచున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడునని ప్రభువు మనలను ప్రార్థినచమని ఆజ్ఞగా గుర్తించగలము. మరియు పౌలు పిలిప్పియులకు రాస్తూ దేనిని గూర్చియు చింతపడక ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా విన్నపములు దేవునికి తెలియజేయలని సూచిస్తున్నాడు. మనకు జీవాధాయకమైన ఇట్టి ఆజ్ఞను అతిక్రమిచక ఇది మనకు అతి ప్రాముఖ్యమైనదని గ్రహించి ఎంతో మేలు చెకుర్చెదిగా గుర్తించవలెయును. ఆజ్ఞాతిక్రమమే పాపము అని మనము ఎరిగినవారమే, ఇందునుబట్టియేగా భక్తుడు ఇలాగు అంటున్నాడు, నా మట్టుకు నేను ప్రార్థన చేయుట మానుట వలన దేవునికి విరోధముగా పాపము చెసినవాడనవుదును(1సమూ 12: 23).  ప్రార్థన చేయుట మానుట వలన ఎందుకు మనము దేవునికి విరోధముగా పాపము చెసినవారమవుదుము, ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టుగా మనము దేవున్ని విశ్వసిస్తున్నాము, ఏమని విశ్వసిస్తున్నాము అయన మనలను పాపమునుండి రక్శించువాడని, బాదలను బాపెవాడని, నిరాశలలో, సమస్యలలో, ఇబ్బందిలో  ప్రతివిధమైన దానికి తగిన సమాధానము అనుగ్రహించువాడని మన జీవానికి ఆధారమని, అయన లేనిదే లోకంలో ఉనికి కలిగిఉండుట అసాధ్యమని, అయన సమాస్తమును చేయగల సమర్థుడని పరిశుద్దత ప్రేమ నీతి న్యాయం యదార్థత దేవుని గుణలక్శణాలని మనము విశ్వసిస్తున్నాము. ఆ విశ్వాసము చొప్పుననే మనము దేవునికి ప్రార్థించబద్దులమై యున్నాము. యుక్తమైన ప్రార్థన ఎట్టిది? ఏ విధముగా ప్రార్థించాలి? ఏ సమయములో ప్రార్థించాలి? ప్రార్థనకు జవాబు రావాలంటే ఏమి చేయాలి? ప్రార్థన విధములు? ప్రార్థన శక్తి ఎంత?ప్రార్థన వలన లాభమెమిటి? ప్రార్థించకుండుట వలన వచ్చే నష్టాలు? అనే ప్రార్థన గురించి కొన్ని సంగతులను ధ్యానిచుకొందాము.  
                       నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెతలు 15:29    
యేసు క్రీస్తు గెత్సెమనె తొటలోని ప్రార్థన సందర్బమును ధ్యానిస్తూ ప్రార్థనలో మనం కలిగి ఉందవలసిన 7P’s  విషయాలను ధ్యానిద్దాం.  లూకా 22:39-46
H  స్థలము (Place)- ఒలివ కొండ – 22:39
 పౌలు యొక్క ప్రార్థన స్థలాలు
ఇంటిలో ప్రార్థన అ.కా. 9 : 11
సంఘంలో ప్రార్థనఅ.కా. 14 : 23
చెరసాలలో ప్రార్థనఅ.కా. 16 : 25
సభ ముగింపులో ప్రార్థనఅ.కా. 20 : 36
సముద్ర తీరాన ప్రార్థనఅ.కా. 21 : 5
మందిరములో ప్రార్థనఅ.కా. 22 : 17
ద్వీపములో ప్రార్థనఅ.కా. 28 : 8
  వాడుక (Practice)- అలవాటు – 22:39
_  ఉద్దేశ్యం (Purpose)- దేవుని చిత్తము – 22:40,42  
న్యాయాధిపతుల గ్రంథములో 7 ప్రార్థన సందర్బాలు 
¯  దేవుని అనుమతి కొరకు ప్రార్థన – 1 : 1
¯  నాయకుని నియామకం కొసం ప్రార్థన – 3 : 15
¯  ఉన్నత దశ కొసం ప్రార్థన -6 : 6 
¯  పిల్లల కొరకు ప్రార్థన – 13 : 8
¯  బలము కొరకు ప్రార్థన – 16 : 28
¯  దేవుని సన్నిది విమొచన కొరకు ప్రార్థన – 20 : 28
¯  దేవుని ప్రజలై కనబడని వారి కొరకు ప్రార్థన – 21 : 13     
  🛐 భంగిమ (Posture)- మోకాళ్ళూని – 22:41
               నిలువబడి ప్రార్థన -1రాజులు 8: 22, మార్కు 11: 25
               సాగిలపడి ప్రార్థించుట - కీర్తనలు 95: 7
               మోకాళ్లూని ప్రార్థించుట - 2దిన 6: 13, .కా20: 36
                నేలమట్టుకువంగి సాగిలపడి ప్రార్థించుట- యెహోషువ 5: 14
                చేతులెత్తి ప్రార్థన - కీర్తనలు 28: 2, 1తిమోతికి 2: 8
Ñ  రహాస్యత (Privacy)- వారి యొద్ద నుండి రాతి వేత దూరం వేళ్ళి – 22:41
తలుపు వేసుకొని రహాస్యమందున్న తండ్రి చూచునట్టుగా
S  వేల (Price) – చెమట రక్తంగా కారునంతగా – 22:44
~  శక్తి (Power) – పరలోకము నుండి బలము – 22:43
        దేవుడు సర్వాంతర్యామి ఆయన అంతట ఉండువాడు, ఆయన లేని ప్రదెశమంటూ ఏది లేదు.  అయితే దేవునితొ మట్లాడటానికి మనకు అడ్డమెమి లేకుండ ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండ మనం ఎవ్వరియొదుట దేవునికి మొరపెట్టలేని వాటిని దేవుని యొద్ద పరిష్కరించబడుటకు వీలుగా ఒంటరి ప్రార్థనలో మనకంటు ఒక స్థలము ఉండుట మంచిది. అది ఇంటిలోనైనను మరేక్కడైనను నీవు దేవునితొ మట్లాడు మాటలు దేవుడుతప్ప మరెవ్వరు వినలేనంత రహస్యత మన ఒంటరి ప్రార్థనకు ఉన్నయేడల తండ్రి మనతొ చక్కగా ముచ్చటించును. ఆత్మీయ జీవితంలో ఈ అనుభవము బహు శక్తినిచ్చును. ఇట్టి వారు తండ్రి చిత్తమును ఎరిగినవారై దేవుని మనస్సు కలిగియుందురు. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. మనము వేడుకొను దేనిని గూర్చియైనను భూమి మీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న తండ్రి వలన మనకు దొరకునని చెప్పుచున్నాడు.
ప్రార్థించుటకు నీకున్న అవసరతలను గుర్తించు: నీవు వట్టి మనిషివని నీ స్వనీతి వలన ఏమి సాదించలెవని, నీవలన సఫలము కాగల కార్యము ఒక్కటియు లేదని తెలుసుకో. ప్రార్థించుటకు మనకు అనేకమైన అవసరతలు ఉన్నాయి వ్యక్తిగతంగా కుమారునిగా కుమార్తెగా తండ్రిగా తల్లిగా భర్తగా భార్యగా విధ్యార్థిగా ఉద్యొగిగా ఒక పౌరునిగా భొదకునిగా సంఘకాపరిగా పరిచారకునిగా సువార్తికునిగా గాయకునిగా విశ్వాసులమైన మనం  పొషిస్తున్న పాత్రలను గుర్తెరిగి ప్రార్థించవలసిన భాధ్యత ఎంతైన ఉన్నది.దేవుని చిత్తానుసారముగా జీవించుటకు,  అత్మీయముగా అన్ని విషయాలలో విశ్వాసములో ఎదుగుటకు నీరిక్శణను పెంపొందించుకొనుటకు, శ్రమలలో దేవునికి నమ్మకంగా ఉండుటకు శొధనలను జయీంచుటకు అత్మ ఫలములు ఫలించుటకు దేవునిలో చక్కగా అంటుకట్టబడుటకు సమయొచిత గ్నానం కొరకు పరిశుద్దతము జీవించుటకు ఉజ్జివము కలిగిన అత్మీయత కొరకు అత్మను ఆర్పక ఎల్లప్పుడు మండుచుండులాగున ఎల్లప్పుడు దేవుని అత్మ నింపుదలకు వాక్యలోని మర్మమైన నిధుల కనుగొనులాగున మాదిరికరముగా బ్రతుకుటకు నోటిని కాచుకొనుటకు ఆలోచనలను శుద్దికరించుకొనుటకు త్రొట్టిల్లకుండ నడచుటకు నశించుచున్న ఆత్మల రక్శణకొరకు సంఘంలో బలహినులకొరకు నాయకుల కొరకు యవ్వనస్తుల కొరకు చిన్నపిల్లల కొరకు సంఘం క్శెమాబివ్రుద్ది చెందులాగున అనే తదితర అత్మీయ అవసరతలను మన ప్రార్థనలో గుర్తుంచుకొవాలి. అంతేగాక అనుదిన బ్రతుకులో అనేక వ్యక్తిగత అంశాలపై ప్రార్థించదమనెది సంపూర్ణంగా దేవునిపై అనుకొవడం వంటిది ప్రతీ చిన్న చిన విషయాలను గూర్చి ప్రార్థించుట మన జీవితంలో దేవున్ని అనుమతించడం వంటిది. కుటుంబ జీవితం కొరకు సమాజ శ్రేయస్సు కొరకు ఉన్న ప్రార్థన అవసరతలను గుర్తించి వాటి విషయమై దేవునికి విన్నవించాలి.        
యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. సామెతలు 15: 8
దేవుని యొద్ద ప్రార్థించు: మనకు సమస్యలు వచ్చినప్పుడు తిర్చగల మనుష్యులు అనేకం ఉందవచ్చును కాని సమస్త మానవాళిని దేవుడే బ్రతికించుచున్నాడని ఎల్లప్పుడు గుర్తుంచుకొవాలి, అది మనం గుర్తెరిగినప్పుడు ప్రతి విధమైన విన్నపములను మొదట దేవుని యేదుటె  విన్నవిస్తాము. ప్రభువైన మన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అనుటకు ఇది ఒక ఆధారం. సిలువలోని దొంగ మన ప్రభువైన క్రీస్తు శక్తి యేరిగిన వాడై అయనను వేడుకున్నాడు అందుకు ప్రతిఫలముగా పరదైసులో ప్రవెశం పొందాడు. స్తెఫను హింసించ బడుచును ప్రభువునకు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని మొరపెట్టడు. అయనయే మన తండ్రి మనము అయన కుమారులము. మన తండ్రియైన దేవుడు మహొన్నతుడు ఆకాశమహాకాశములు పట్టజాలనంత ఉన్నతుడు. అటువంటీ మహిమా స్వరూపి శక్తిమంతుడు అశ్చర్యకరుడు బలమంతుడు నిత్యుడగు తండ్రిని కలిగిన మనము అయనతొ ప్రార్థన సహవాసము లెకయే బ్రతుకుట ఎంత మూర్ఖత్వం, అది తండ్రిని అలక్శ్యము చేసేది అవుతుంది అందుకనే ప్రార్థన చెయుట మానుట అనేది దేవునికి విరోధమైన కార్యముగా చెప్పబడింది. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.
 ప్రార్థనలను విని ఉత్తరమిచ్చు దేవుడు: విరిగి నలిగిన హ్రుదయాలను భారభరితమైన మనస్సును కన్నీరు కార్చే భాదలను సమస్యలను ఆకాశమందుండి ఆలకించి దయ ఉంచి క్రుప చూపువాడు. సర్వమును సాద్యపరచె శక్తిసంపన్నుడు. మన బ్రతుకు ఎపాటిది? క్శణముండె నీటి బుడగవంటిది, ఈరోజు ఉండి రేపు వాడీపోయే గడ్డిపువ్వువంటిది, మన ఆయుస్సు ఎంతకాలం? జ్ఞానం ఎట్టిది? బలం ఎంతది? బ్రతుకు విధానము ఎట్టిది? అయినను నిన్ను నన్ను ప్రేమించి తన మహిమనంత విడచి దేవుడే మానవునిగా దిగి వచ్చి ఘొరమైన సిలువలో బలియాగమై పాపము నుండి విడిపించెను, ఇది మనము విశ్వసించుట చేతనే కదా మనలను కుమారుడా కుమార్తె అని పిలుచుచున్నాడు. కాబట్టి నిశ్చయముగా అయనను వెడుకొనుటయే అయనకు మొరపెట్టుటయే మనకు విధి. ఇట్టి ప్రార్థన విధి అలవాటు కలిగి ఉండాలనే దేవుని కొరిక. ఇది లేని వారము దేవుని పిల్లలము అనుటకు అనర్హులము. చంటి పిల్లవాడు తన తండ్రిపై ఆధారపడినట్టుగా ప్రార్థనలో గడుపుట జీవధాయకము.         
                       ప్రకటన గ్రంథములో పరిశుద్ధుల ప్రార్థనలు ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలలో నిక్శిప్తం చేసినట్టుగా పరలోకంలో కనబడుతుంది.  పరిశుద్దతొ చేసే ప్రార్థనలు ఎంతో విలువైనవిగా దేవుని కీర్తిని కొనియాడెవిగా ఆకాశమందున్న దేవుని నివాసమునకు వేళ్ళె యొగ్యమైనవిగా అర్హతను సాధించినవిగా ఉండును. తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువు వాగ్దానము ఇచ్చాడు.
 ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము. రోమా 8:26
 యుక్తముగా ప్రార్థించుట:   తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నమో తండ్రి యెదుట  మోకాళ్లూని, దావిదు ప్రార్థించినట్టుగా దేవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును అన్నట్టుగా దేవుని దిక్కునకు చూస్తూ ఆత్మను ఎత్తికొనుచు, ఆకాశమందున్న దేవుని తట్టు మన *హృదయమును మన చేతులను ఎత్తికొనుచు, యెల్లప్పుడు ఆయన యందు నమ్మిక యుంచుచు ఆయన సన్నిధిని *హృదయములు కుమ్మరిస్తుండగా దేవుడు మనకు ఆశ్రయమగును. మన ప్రభువు నామమును బట్టి *కంఠధ్వని యెత్తి ప్రార్థించిన యేడల శ్రమలన్నిటిలో నుండి మనలను  రక్షించును. కీర్తనకారుడు ఇలాగున పలుకుచున్నాడు నాకైతే *దేవుని పొందు ధన్యకరము  సర్వకార్యములను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను. ప్రతీ విషయామై దేవుని యొద్ద వచ్చుట సర్వమును జరిగించువాడని అయనను మహిమపరచువారమైతాము. మనకున్న ప్రతీ దేవుడు తీర్చువాడని *ఆశ ఆసక్తితో ప్రార్థన చేయలేను. నీవు నన్ను ఆశీర్వ దించితేనే గాని నిన్ను పోనియ్యను అనేట్లుగా యాకోబు మాదిరిగా *గొజాడుతు *యెడతెగక ప్రార్థన కలిగిఉందాము.    


      ప్రార్థించుటకు మన హృదయము యొక్క స్థితి ఎంతో ప్రాముఖ్యమైనది. అది ఏ విధముగా ఉండాలో పౌలు హెబ్రియులకు రాస్తున్నాడు, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు *ప్రోక్షింపబడిన  హృదయములు గలవారమును, *నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునైయుండి, *విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, *యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరవలేను. మరియు మనం ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదుమొ అవి *దొరకినవని నమ్మిన యెడల నం వాటినన్నిటిని పొందుదుమని ప్రభువు చెప్పుచున్నాడు. *జాగ్రత్తగా దేవుని వెదకిన యెడల సర్వశక్తుడగు దేవుని *బతిమాలుకొని యెడల *దేవుని దృష్టికి అనుకూలమగు విన్నపములు దేవుని చిత్తానుసారముగా మొరపెట్టిన యేడల అయన తప్పక ఉత్తరమిచ్చును. స్వస్థతపొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చెసుకొనవలేయును. ఆత్మచేత ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను *పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు *మెలకువగా ఉండుడి. మనము దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొంది, ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయీంచును. వ్యక్తికీ కూడా మోతాదు మించి దేవుని ఆత్మ బలప్రభావాలు ఉండవు. అంతేగాక ఎవరూ కూడా మరొకరికి దేవుని ఆత్మను అప్పుగా ఇవ్వలేరు. తమ దారిలో దేవుని ఆత్మ ప్రకాశింపజేసే వెలుగు అనుభవాన్ని ఇతరులకు ఇవ్వలేరు. అది దేవునినుంచి మాత్రమే రావలసిన వ్యక్తిగత అనుభవం. ప్రతి వ్యక్తీ దేవుని దగ్గరికి వెళ్ళి దాన్నిపొందుకొవలసిందే (యెషయా 55:1-3; సామెత 23:23; లూకా 11:13; ప్రకటన 3:18). నము *దేవుని వెదకుతు, *పూర్ణమనస్సుతో అయనను గూర్చి విచారణ చేసినయేడల నము సత్యమును సమాధానమును కనుగొందుము. అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింప, సంఘ ప్రార్థనలో బహిరంగ ప్రార్థనలలో విస్తరించి మాటలాక క్లుప్తంగా ప్రార్థించాలి. ఒంటరిగా ప్రభువుతొ ఉన్నప్పుడు విస్తరించి మాట్లడు. భయ భక్తి విధెయత మనస్పూర్తిగా విశ్వాసపూర్వకంగా భావావెశితమైన ప్రార్థన చిన్న మాటైనను జవాబును పొందెదిగా ఉంటుంది, దేవునికి ఇష్టకరంగా లేకుండ ఎంతగా మనుష్యులకు వినసొంపుగా భయభక్తి కలిగిన వారిగా ప్రార్థించిన వ్యర్థమే. ప్రార్థనలో ఇతరులకు వాక్యం భొదించె వారుగా ఉండకండి. కాకపొతె దేవా నీవు ఈ వాగ్దానము చేశావు అని వాక్యమును ఎత్తి పట్టి మొరపెట్టుదాము. మనుష్యులకు కనబడవలెనని వేషధారుల వలె ఉండక మనుషుల కంటే దేవునికే కనబడవలేనని జాగ్రత్త పడుదాము.     
                     కటాక్షముంచుమని కరుణింపుమని మనం తెలిసి తెలియక చేసిన *పాపముల విషయమై క్షమాపణ వేడుకొనుచు నిన్ను నీవు ఒప్పుకొనుట వలన దేవుని కరుణను కొరిన వారమవుదుము. పాప క్షమాపణ లేకుండ దేవుని ఏ మానవుడును నిలువజాలడు. అయన పరిశుద్దుడు గనుక మనలను మనం పరిశుద్దపరచుకొనుచు దేవుని సన్నిదికి వేళ్ళవలెయును. దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ నా హృదయమును త్వరపడనియ్యక నీ *నోటిని కాచుకొనుచు ప్రార్థనను దేవుని సన్నిధిని *సిద్ధముచేసి వేచియుందము. *విసుకక *నిత్యము నిరీక్షణగలవారై *సంతోషించుచు, *శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండాలి. మన ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, *జ్ఞానము చొప్పున ప్రతీ మనుష్యునితోనూ నడచుకొనవలెయును. దీన ప్రార్థనలు మన స్థితిని యేరిగి *తగ్గింపు స్వభావముతొ ప్రార్థించడం దేవున్ని ఉన్నతున్ని చెయడం అయనకు సంపూర్ణ విధెయత చూపడంవంటిది అవును అయన ద్రుష్టి దీనులయందున్నది. మా దేవా నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు అని దానియేలు ప్రార్థించినట్టుగా ప్రార్థిద్దాం.    
ప్రార్థించు సమయము:ప్రార్థనకు ఒక సమయము అంటూ ఎది లేదు, ప్రతీ సందర్బంలో దేవుని సహాయము అవసరము కాబట్టి ప్రతీ సమయము ప్రార్థన సమయముగా మనకు ఉండవలెయును. అందరితో ఉన్నప్పుడు మనసులో ప్రార్థించు ఒంటరిగా ఉన్నప్పుడు నోరు తెరచి గొంతెత్తి ప్రార్థించు, సంఘంలో ఉన్నప్పుడు నీతోటి వారికి క్శెమాబివ్రుద్ది కలునట్లు ప్రార్థించు. శ్రమ సంభవించినప్పుడు శ్రమలో నమ్మకంగా ఉండుటకు, సహించుట ఏలాగుననొ ప్రార్థించు. సంతోషము కలగినప్పుడు స్తుతియీంచు కీర్తనలు పాడుము ఆపద నుండి తప్పించినప్పుడు మేలు కలిగినప్పుడు దేవునికి క్రుతగ్నత కలిగియుండు. తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టుచు ఉదయముననే మన కంఠస్వరము వినబడునట్లుగా ప్రార్థన దేవుని సన్నిధిని సిద్ధముచేసి కాచియుందము. ఆత్మను కలిగిన వారమై ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచుండవలెను.

"ఒక పక్షికి రెండు రెక్కలేలాగో ఒక విశ్వాసికి బైబిలు, ప్రార్థన అలాంటివి"
లోకంలో పడకుండా వుండాలంటే ఒకే ఒక్క మార్గము 'మోకాళ్ల మీద పడటమే
చెరసాల నుండి పేతురును దూత బయటకు తీసుకొని వచ్చెను కానీ దూతను చెరసాల దగ్గరకు తీసుకొని వచ్చినది ప్రార్థన"
అబ్రహాము యాత్ర జీవితంలో ప్రార్థన తొలి అడుగులు :
అది 12:1-20 – 13:1-4
ð  బయలు వెళ్ళెను – ప్రార్థించెను – 12:4
ð  సాగి వెళ్ళెను- ప్రార్థించెను- 12:9
ø  దిగి వెళ్ళెను – ప్రార్థించలేదు – 12:9
ö  ఎక్కి వెళ్ళెను- ప్రార్థించెను- 13:1
దిగి వెళ్ళెను – ప్రార్థించలేదు – 12:9 :-
ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను కాని అందులో ప్రార్థన చేయలేదు బలిపిఠము కట్టలేదు. బైబిలులో బలిపిఠము అంటే ప్రార్థన
ప్రార్థన రహిత జీవితం/ ప్రార్థన చేయకపోవడం వల్ల కలిగిన నష్టాలు :
D  వ్యక్తిగత నష్టము అది 12:17
ప్రభువును విడచి మనుష్యులపై ఆధారపడుట, ఒక స్త్రీ ఆధారం అన్నట్లు దిగజారిన అనుభవం, నిరాధారుడుగా దేవుని ఆధారం లేకుండ ఉన్నాడు. నా సహొదరివని దయచేసి చెప్పుమని ప్రాధెయ పడుతున్నాడు.   
D  కుటుంబ నష్టము – అది 12:17
అబ్రహాము ఇంటి స్త్రీ ఫరో ఇంటికి తెబడెను
D  సామాజిక నష్టము – అది 12:17
శారాను బట్టి ఫరో ఇంటివారు మహావేదన చెత బాదింపబడ్డారు.  
D  అనువంశీక నష్టము(వంశముపై ప్రభావము)-అది 12:16; 26:6,7  
                       దేవున్ని ఎరుగని అన్యజనుల మీద అయన నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను ప్రభువు తన ఉగ్రతను కుమ్మరించువాడు. ఈ ఉగ్రత  అన్యజనుల మీదనే కాదు ప్రభువును ఎరిగియు ఆయనకు మొరపెట్టని సంపూర్ణంగా దేవునిపై ఆధారపడని వారందరిపైకి వచ్చును. అది మహా భయంకరమైనది నిత్య నరకానికి దారియే యున్నది. మనిషి జీవితలో దీనికి మించిన నష్టము మరోకటి లేదు. దీని నుండి కోలుకొవడమనేది అసాధ్యము. ఇది అంత్యతీర్పునందు వేలువడభొయే భయనకమైన నగ్న సత్యం, ఇట్టి తీర్పు పొందభొవు వారిని ప్రభువు ముందుగానే హెచ్చరించాడు. బుద్దికలిగిన వారమై ఈ గుంపు నుండి తప్పించు కొందము. అయితే ఇందులో మరోకరు కూడా ఉన్నారు, వారి గూర్చి ప్రభువు ముందుగానే తీర్పు తీర్చాడు. వీరు ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? దయ్యములను వెళ్ళగొట్టలేదా? అనేక అద్బుతములు చేయాలేదా? అని చెప్పినప్పుడు ప్రభువు వారితో, నేను మిమ్మును ఎన్నడును ఎరుగను అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని దండిచినట్టుగా చూస్తాము. ఇక్కడ ఈ సందర్బపు పై వచలను మనం గమనిస్తే ప్రభువు నామమును బట్టి ప్రార్థించడం అది తప్పక చేయతగినది, కాని మన ఉద్దెశ్యములు ఎలా ఉన్నయి అన్నది ప్రాముఖ్యంగా ఆలోచించాలి. అది దైవ చిత్తానుసారమైనదియై ఉండవలేయును. మన ఉద్దెశ్యములు స్వలాభం స్వనీతి అక్రమమైనదిగా కాక దేవున్ని మహిమ పరుచునదిగా ఉండాలి. అట్టి మనస్సుతో దేవుని యొదుట కలిగిఉండటం ఎంతో మేలుకరం. ఈ విధముగా ప్రార్థించు వారిని గూర్చియే ప్రభువు నామమును బట్టి ప్రార్థించువాడు రక్శింపబడును అని హ్రయబడినట్టుగా చూస్తాము. మనం ప్రార్థించే భక్తులుగా ఉండాలి, మనకు ఇది ఎంతో అవసరం.        
యెహొషాపాతు యొక్క ప్రార్థనలో 7 నాణ్యతతో కూడిన విలువలు/ 7 రకాల ప్రార్థనలు  
ü  ఒంటరి ప్రార్థన/ ఎకాంత ప్రార్థన – 2 దిన 20:3, దానియేలు 6:10  
ü  కుటుంబ  ప్రార్థన – అది 14:14, 2దిన 20:13; యొబు 1:5; మత్తయీ 18:20
ü  సమాజ  ప్రార్థన – 2 దిన 20 : 4 ; సంఘ ప్రార్థన – అ.కా. 12 : 5  
ü  ఉపవాస  ప్రార్థన – 2 దిన 20 : 3 ;  మార్కు 9 : 29
ü  అత్యవసర  ప్రార్థన – 2 దిన 20 : 3,4  ; దాని 2 : 17; యాకోబు 5:16  
ü  వాగ్దానము లెత్తి  ప్రార్థన – 2 దిన 20 : 6-12 ;  2 కొరింథి 1 : 20
ü 
వేదనతో కూడిన  ప్రార్థన – 2 దిన 20 : 12 ; విలాప 2 : 19; కన్నీటి ప్రార్థన – 2రాజులు 20:5; అ.కా. 20:19  


విశ్వాసి ప్రార్థనలో దేవునికి మహిమ – లూకా 9 :29
విశ్వాసము నుండి తప్పి పోయినప్పుడు ప్రార్థనకు ఆటంకము కలుగుతుంది. – కీర్తనలు 66 : 18
చిన్న ధ్యానం : విలాపవాక్యములు 2:18,19
4 సంగతులు
³  ఎవరు ప్రార్థించాలి ? – జనులు 2: 18
³  ఎలా ప్రార్థించాలి? – హ్రుదయపూర్వకంగా (కన్నిటితొ) 2: 18
³  ఎప్పుడు ప్రార్థించాలి? రేయీ మొదటి జామున 2 : 19
³  ఎందుకు ప్రార్థించాలి? పసిపిల్లల కొరకు (ప్రపంచ స్థితి కొరకు) 2 : 19
        రాత్రి జాములు 4 రకాలు ( 6-9, 9-12, 12-3, 3-6 గంటలు )
కుష్ఠు రోగి ప్రార్థనలో 7 సంగతులు – మార్కు 1:40-43 / Short Prayer but sharp Prayer
þ  దీన ప్రార్థన – 1: 40 నాకు దిక్కెవ్వరు లేరు ప్రభువా నీవే దేవా? – కీర్తనలు 34:6  
þ  మోకాళ్ళూని (భక్తితో కూడిన ప్రార్థన)- 1:40 (దానియేలు 6:10)
þ  నీకిష్ఠమైతె (విధెయతతొ కూడిన ప్రార్థన)(ప్రభువు చిత్తమునకు సెలవియ్యడం)- 1:40, మత్తయీ 26:39
þ  నన్ను (వ్యక్తిగత ప్రార్థన)- 1:40, లూకా 23:42
þ  శుద్దునిగా (అవసరత ఎరిగిన ప్రార్థన)- 1:40, యొహను 15: 7 
þ  చేయగలవు (విశ్వాస సహిత ప్రార్థన)- 1:40
þ  క్లుప్త ప్రార్థన – 1:40 , మత్తయీ 6:7, రోమా 8:26 – యుక్తముగా ప్రార్థన
ప్రార్థనను గూర్చి 7 పాఠములు
¼   ప్రార్థన ఒకడు రక్శణ పోందిన దానికి గుర్తు- అ.కా. 9:11
F  ప్రార్థన ఒక హెచ్చరిక- 1తిమోతి 2:1-3
%  ప్రార్థన ఒక పోరాటం – కొలొస్సి 4:12,13
  ప్రార్థన ఒక కేక – మత్తయీ 20:30,34
©     ప్రార్థన ప్రేమకు ఒక సూచన – రోమా 10:1
  ప్రార్థన ఒక అర్పణ – కీర్తనలు 141:1
  ప్రార్థన ఒక సేవ – లూకా 2:37
🙏 *భక్తుల ప్రార్థన*🙏
👉 ప్రజల కోసం *మోషే* వలె ప్రార్ధించు. 👉 నాయకుడిగా ఉన్నప్పుడు *యెహోషువా* వలె ప్రార్ధించు👉సమస్తాన్ని కోల్పోయినప్పుడు *సంసోను* వలె ప్రార్ధించు. 👉 సంతానం కోసం *హన్నా* వలె ప్రార్థించు. 👉 విజయం కోసం *సమూయేలు* వలె ప్రార్థించు. 👉 పాప క్షమాపణ కోసం *దావీదు* వలె ప్రార్ధించు. 👉 దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు *సొలోమోను* వలె ప్రార్థించు. 👉 స్వస్థత కోసం *హిజ్కియా* వలె ప్రార్ధించు. 👉 పని ప్రారంభించేటప్పుడు *నెహెమ్యా* వలె ప్రార్ధించు👉 అన్యుల ఎదుట *ఎలియా* వలె ప్రార్ధించు.
👉 స్నేహితుల కొరకు *యోబు* వలే ప్రార్ధించు. 👉 ప్రతిరోజు *దానియేలు* వలె ప్రార్థించు. 👉 మృత్యువుతో పోరాడుతున్నప్పుడు *యోనా* వలే ప్రార్థించు. 👉 చెరసాలలో ఉన్నప్పుడు *పౌలు, సీలల* వలె ప్రార్థించు. 👉 సేవకుల కోసం *పేతురు* కొరకు సంఘం ప్రార్థించినట్లుగా ప్రార్ధించు. 👉 చర్చికి వెళ్లినప్పుడు *సుంకరి* వలె ప్రార్థించు. 👉 హింసించే వారి కోసం *స్తెఫను* వలె ప్రార్థించు. 👉 పరిశుద్ధాత్మ కోసం *పేతురు, యోహాను* వలె ప్రార్ధించు. 👉 అన్ని సమయములందు *యేసుక్రీస్తు* వలె ప్రార్ధించు.

No comments:

Post a Comment