Sunday 10 June 2018

పరలోక రాజ్య యాత్రికులము



                                              పరలోక రాజ్య యాత్రికులము

విషయ సూచిక  :

1. యాత్రికులము
2. పౌర సత్వము  
3. యాత్ర లో సిద్ధపాటు సాధనములు
      i. మార్గ సూచి -దారి తెలియుటకు
      ii అన్నపానములు -బలము పొందటానికి
      iii. వస్త్రములు -సంరక్షణ కొరకు
      iv. దీపము - మార్గములో వెలుతురు కొరకు
      v.  ఆయుధము - సర్వాంగ కవచము
      vi. ధనము- ఆత్మల సంపాదన
4. యాత్రలో పాటించవలసిన నియమ నిబంధనలు
5. యాత్రలో పాటించవలసిన  జాగ్రత్తలు
   


- విశ్వాసము తో సాగాలి
- సమయాన్ని పాటించాలి , సమయానుగుణంగా సాగాలి
-జాగరూకత తో ఉండాలి
-జాగ్రత్త కలిగి నడవాలి
- ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండాలి
-నిరీక్షణ తో ముందుకు సాగాలి
- ఆగిపోక సాగిపోవాలి
-అనుభవాలతో చక్కగా పునాది వేసుకుంటూ సాగాలి
-ఓపిక తో, నేర్పుగా నడవాలి
- గురి కలిగి, దారి తొలగక సాగాలి
-శ్రద్ధ తో ఆసక్తి గ ముందుకు నడవాలి
-విశ్వాసాన్ని కోల్పోక ధైర్యాన్ని కూడగట్టుకుంటూ నడవాలి
-ఆపదలో ఉన్న వారిని ఆడుకుంటూ
-రక్షణ లేని వారికీ రక్షణ మార్గము చూపుతూ
-దారి తప్పక, దారి తప్పిన వారికీ దారి చూపుతూ
-ఆనందంతో ఉత్సాహముగా
-దేవునితో సంబంధము కోల్పోక
-ఎదురు చూపు కలిగి
-న్యాయముగా నడచుకొంటూ
-సత్యమును ప్రేమించుచు
-దేవుని ప్రేమ కలిగి
-దైవ భయము తో
-చింతిపక, విచారింపక, అనుమానము కలిగి ఉండక
-హృదయ పూర్వకముగా దేవుని ఆరాధన కలిగి
-దేవుని పిల్లలకు తగిన వారముగా
-సువార్తికులుగా ఉంటూ
-బలమును పొందుకొంటూ
-మంచి నడవడి, ప్రవర్తన కలిగి
-యుద్దములో పోరాడు యోధుడుగా
-పందెములో పరుగెత్తు వానిగా
-ఆలసిపోక
-నిద్రమత్తులుగా ఉండక
-సోమరులుగా కాక
-చురుకైన వారిగ
-కష్టపడుటకు ఇష్టపడే వారిగ
-పరిశుద్ధత కలిగి
-రక్షణను కాపాడు కొంటూ
-ఇతరుల  పట్ల ప్రేమ కలిగి
-క్షమ హృదయం కలిగి
-ఆయనను ఒప్పుకొనుచు
-అయన అధికారమునకు లోబడి
-సంపూర్ణ భయ భక్తులతో
-ప్రతి విషయంలో ప్రార్థన మానక
-దేవుని చిత్తానుసారముగా నడచుకుంటూ
-ఒకరినొకరము బుద్ది చెప్పుకొనుచు
-దైవ ఉపదేశము కలిగి జ్ఞానము తో నడచుకుంటూ సాగాలి
-వాక్యపు వెలుగులో సరిచూచు కొనుచు
-తప్పును నిర్మొహమాటముగా ఖండిస్తూ
-పొంచిఉన్న ప్రమాదాలను తప్పించుకుంటూ
-ఫ్రభువును చేరాలనే ఆకాంక్షతో
-ఆయనకు సన్నిహితులముగా
-అయన చేయి పట్టుకొని నడుస్తూ
-అయన వైపు చూస్తూ
-ప్రభువైన క్రీస్తు స్వరూప్యములోనికి మారుతూ
-రాజమార్గములలో చక్కగా నడుస్తూ
-లోకాశాలకు లొంగక
-నితత్యమునకు పాత్రులముగా
-పొందబోవు బహుమానమందే గురి కలిగి
-యదార్థతో, నిర్మలమైన మనస్సు కలిగి
-పాములవలె వివేకులుగాను, పావులమువలె నిష్కపటులముగాను
-ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుతూ
-జీవ మార్గములో నిలుస్తూ
-జీవ గ్రంథమందు పేరు వ్రాయబడిన వారముగా
-


యాత్రికులము :-

క్రైస్తవలు ఈ లోకములో యాత్రికులు అది మొదట మన విశ్వాసుల తండ్రియైన అబ్రాహామును దేవుడు పిలిచిన పిలుపుతో ప్రారంభమైంది, అబ్రాహాము కలిగిన విశ్వాసమును కలిగిన మనమందరము ఆదే మార్గములో ఉన్నాము. ఈ క్రింది వచనముల ద్వారా దేవుడు అబ్రాహామును ఏ విధంగా పిలిచాడో, అతని పట్ల దేవుని ప్రణాళిక ఏంటో, అతన్ని ఏ విధముగా ఉండాలని కోరుకుంటున్నాడో అర్థమవుతుంది,అదే విశ్వాసము కలిగిన మనకును అది వర్తిస్తుంది.
ఆది 12:1 యెహోవా - నీవు లేచి నీ దేశము నుండియు బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.

అబ్రాహామును వచ్చిన పిలుపులో తన దేశము నుండియు బంధువుల యొద్దనుండియు తన  తండ్రి యింటివారి నుండియు వేరు చేసుకోవడము ద్వారా అతడి భూమి మీద పరదేశిగా, యాత్రికునిగా జీవించాలన్న సంగతి ఇమిడిఉంది.  అంతేగాక అబ్రాహామును వచ్చిన పిలుపులో
భూ సంబంధమైన దేశమే కాక పరలోక సంబంధ దేశము కూడా ఉంది.
హెబ్రీ 11:9 విశ్వాసమును బట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవసులైరి.
 హెబ్రీ 11:10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.
హెబ్రీ 11:14 ఈలాగు చెప్పువారు  స్వదేశమును వెదుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా?
హెబ్రీ 11:15 వారు ఏ దేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న యెడల మరల వెళ్ళుటకు వారికీ వీలు కలిగియుండును.
హెబ్రీ 11:16  అయితే వారు  మరి శ్రేష్ఠమైన దేశమును అనగా పరలోక సంభందమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు; ఏలయనగా అయన వారి కొరకు ఒక పట్టణము సిద్ద పరచియున్నాడు.
ప్రకటన 21:1-4; 22:1-5 క్రొత్త భూమి క్రొత్త ఆకాశము (దేవుని పట్టణము)


హెబ్రీ 11:13 వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనము చేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతినొందిరి.

No comments:

Post a Comment