Thursday 31 March 2016

                              ఆత్మీయ అభివృద్ధి పత్రిక                    

                    అపో. కా. 15:31   వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి                                                                        అంశం :ప్రేరేపణ                                     

    ప్రభవు నందు ఈ నా రెండవ పత్రికను చదువుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయ పూర్వక శుభాబివందనములు
ప్రేరేపణకు పర్యాయ పదాలుగా పురికొల్పడం, రేపడం,ఉజ్జివించడం ఇంకా చుస్తే ఆత్మ పరితాపమోదడం, మరులు కొలపబడటం, ఇడవబడటం అనే మాటలను గమనిచాగాలము. ప్రేరేపణ అనగా ఒకరి ద్వారానో ఏదో ఒక దాని ద్వారానో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా నీలో కార్యం జరగడము.
  నేటి లోకంలో అనేకులు  ద్వారా  అనేక విషయాల ద్వార ప్రేరేపిన్చాబడుతున్నారు.ఎఫేసి 2:2 లో సాతాను ప్రేపించు శక్తికి అధిపతి అని చెప్పబడింది జాగ్రత్త వాని ప్రేరేపనకు గురికావద్దు.వారిలో ఉగ్రవాదం ద్వారా, చెడు అలవాట్ల ద్వారా,సినిమాల ద్వారా మరియు సీరియళ్ళ ద్వారా అనేకులు ఇలా నానా విదాలుగా ప్రేరేపించ బడుతున్నారు.ప్రేరేపించ బడినము అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఉదా :సీరియళ్ళు ,సినిమాలను తీసుకొంటే మనకు తెలియకుండానే మన నోటి నుండి ఆ మాటలు , పాటలు ఆ ప్రవర్తన రావడము గమనించవచ్చు.సాతాను చేత ప్రేరేపించ బడటంను మరులు కొలపబడటం, ఇడవబడటంగ చెప్పాబడింది.యాకోబు 1:14 ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఇడవబడి మరులుకోల్పబడిన వాడై శోదింపబడును. క్రైస్తవులమైన మనము ఇలాంటి వాటి చేత ఇడవ(ప్రేరేపించ) బడుచున్నమా?దేవుడు తన మాటలతో సాతాను క్రియల చేత ప్రేరేపించ బడవద్దు అని చెపుతున్నాడు.సామెతలు 1:10 నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.
                   బైబిల్ గ్రంధంలో మనం ప్రేరేపణ అనే విషయాని గమనించినట్లైతే అరువది సార్లకు పైగా వ్రాయబదినట్టు చూడవచ్చు. మొట్ట మొదటగా ప్రేరేపణ అనే మాట మనం నిర్గమ ఖండము లో దేవుడు తన ఆలయ పని నిమిత్తం ప్రేరేపిస్తున్నట్టుగా చూస్తాంఎజ్రా 1:5 ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించేనో వారందరూ వారితో  కూడుకొని వచ్చి యెరుషలెము లో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు పునుకోనిరి.ఇంకా చుస్తే దేవుడు తన పని నిమిత్తం తన వాక్కు ద్వారా ప్రేరేపిస్తున్నాడు కానీ ఎవ్వరు కూడా ఆయన మాట వినటం లేదని దేవుడు ఆరోపిస్తున్నాడు నిజంగా నువ్వు కూడా ఇలాగే ఉన్నావా?
జేకర్య 7:12 దర్మశస్థ్రమును, పుర్వికులైన ప్రవక్తల ద్వార సైన్యములకు ఆదిపతి అగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను, తాము వినకున్డునట్లు హృదయములను కురువిందమువలె  కటిన పరుచుకోనిరి. 
మనం దేవుని చేత ప్రేరేపించ బడిన వారమైన యెడల గోప్పకార్యములు చేసేదమని నూతన మనస్సు పొందిన  వారమగుదుము అని దేవుని మాటల ద్వారా తేలుసుకొవచ్చును.
అపో. కా. 6:10 మాటలాడుట యందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరిపలేకపోఇరి.
న్యాయదిపతులు 14:6యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగ అతడు కొదమ సింహమును మేకపిల్ల వాలే చిల్చేను.  
1సముయెలు 10:6,10 యెహోవా ఆత్మ నే మీదికి బలంగా దిగి వచ్చును, నీవు వారితో కలిగి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును.  
దేవుడు ఇంకను ఆలస్యము చేయుచున్నాడు అంటే అది నీ మనస్సు మర్పుకోసమే! రోమా 2:4 దేవుని అనుగ్రహము నిన్ను మరుమనస్సు నొందుటకు ప్రెరెపిస్తున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్య ర్యమును సహనమును దిర్ఘశాంతమును త్రునికరించుదువా? 
 మనం ప్రేరేపించ బడటం దేవుని గుర్చిన మాటను బట్టియే గాని మరి ఏ విషయంలోనూ ఎవరి చేతను ప్రేరేపించ బడకూడదు,నీతిమంతుడు కదిలింప బడడు అని దేవుని వాక్యము చెబుతుంది కానీ కొందరు ఇరుగు పొరుగు వారి మాటలకూ చిన్న చిన్న విషయాలకే కదిలింప  బడుతుంటారు
దేవుని మందిరములో ఒకరి ద్వారా ఒకరము దేవునిలో ప్రేరేపించబడలి .
హెబ్రీ 10:25 కొందరు మానుకోనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఒకనినోకడు హేచ్చారించుచు, ఆ దినము సమిపించుట మీరు చూచున కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు ప్రేమ చూపుకోను సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికోల్పవలేనని అలోచింతము. 
దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియనిగ్రహము గల ఆత్మనే గని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదని గమనించుకోవాలి. దేవుడు మానవున్ని యదార్థవంతునిగా సృజించాడు కానీ మానవుడు వివిధ తంత్రములను కల్పించుకొంచున్నాడు అని దేవుడు అంటువున్నాడు.పౌలు అంటువున్నాడు ఇంత గొప్ప సాక్షిసమూహము మనలను అవరించియుండగా సుళువుగా చిక్కులు పెట్టుపాపమును వదిలి పెట్టి విశ్వాసమునకు కర్తయుదానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగేత్తేదము.            
2తేస్సలోనిక 3:5 దేవుని నందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ఫ్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక.  
  సహోదరులందరికి ఈ పత్రిక చదివి వినిపించావలేనని ప్రభువు పేర మీకు ఆన బెట్టుచున్నాను1తేస్సలోనిక 5:27

 సహోదరి సహోదరులారా యీ  పరిచర్య కొనసాగా బడుటకు మీ ప్రార్ధనలలో జ్ఞాపకం చేసుకోనుడి .
                        ఈ పత్రిక గూర్చి మీ అభిప్రాయములను తెలియ జేయుడి .
                   దేవుడు ఈ చిన్నిపత్రికను  దీవించి మీతో మాట్లాడునుగాక! ఆమెన్

                                                                                                                          ఇట్లు

                                                                                                    ప్రభువునందు మీ సహోదరుడు
                                                                                                      కాటం  ఇమ్మనుయేలు  రాజు
                                                                                                     8500411860,9618336621 
              
                












No comments:

Post a Comment