Wednesday, 23 March 2016

యవ్వనుల ఆత్మీయ గీతాలు

 సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబందమైన పద్యములతోను ఒకనినోకడు బొదించుచు, బుద్ది చెప్పుచు దేవుని గూర్చిన గానము చేయుచు,సమస్త విదములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్దిగా నివసిమ్పనియ్యుడి.     కొల్లోస్సి 3:16
      
                               పాట -1
. పల్లవి :  నీ మాటలను వీనిపించు చున్నావు
              నీ వాక్యముతో బలపరుచు చున్నావు
 అ . ప.:  వాక్యమై మా మద్య నీవసించు చున్నావు
             ఆదరణ పొంది నీ కొరకు  బ్రతుకుదుము

      *    వాక్యమై మాకు వెలుగై యున్నావు
            నీ వెలుగులో మేము సరిదిద్దుకొందుము  
     *    వాక్యమై మాకు సత్యమై  యున్నావు
           నీ సత్యములో జ్ఞానము పొందెదము      
    *   వాక్యమై మాకు  జీవమై యున్నావు
         నీ జీవము పొంది స్తోత్రించేదము             
   *   వాక్యమై మాకు మార్గమై యున్నావు
        నీ రాజ మార్గములో చక్కగా నడిచెదము

                            పాట -2
            మహోన్నతుడా సత్యస్వరుపుడా జీవముగల దేవుడా రోషము గల దేవుడా  
            నీ ప్రేమే నను ఆకర్షించినది నీ కృపయే నను కాపాడుచున్నది             
 పల్లవి : చూచు చున్న దేవుడా నీవే నా యేస్సయ్య
            మమ్ము కాపాడువాడవు నీవే
        *  పరిశుద్దుడవు పరలోక రాజువు
           పావనుడ పవిత్రుడా నా యేస్సయ్య
            నీవు పరమందు ఉన్నవాడవు      
      *  అత్యున్నతుడా అతిసుందరుడా 
         దవలవర్నుడా రత్నవర్నుడా
         నీ కన్నులు అగ్ని జ్వలాల వంటివి   
    *  నిత్యుడగు తండ్రి బలమైన దేవా 
        సైన్యములకు అదిపథివి న యేస్సయ్య 
        బలశౌర్యములు నీవే                   
  *   అద్బుతకరుడా ఆశ్చర్యకరుడా 
      ఆలోచనా కర్తవు నా యేస్సయ్య   
      ఉహకందనివాడవు                    
 *   కరుణామయుడవు కృపామయుడవు 
     జాలి చూపువాడవు నీవే నా యేస్సయ్య 
     దయామయుడవయ్య                
                      పాట -3
పల్లవి: కృప చూపు వాడావ్ నీవు నీవే దయ చూపు వాడావ్ నీవు        
        స్తుతులందుకోనుము  దేవా  మా ఆరాధనాలందుకో 
*   నీ కృప చూపి అభ్రహమును   విశ్వాసుల తండ్రిగా మార్చితివి
    వర్దిల్లు కృపను , హెచ్చించు కృపను చూపితివే
*  నీ కృప చూపి యాకోబును ఇశ్రాయేలు నీ ప్రజగా చేసుకొంటివే
    ఉన్నతంబగు కృప,ఆశిర్వాద కృపను చూపితివే
*  నీ కృప చూపి సౌలును  పౌలుగ నీ మాదిరిగా చేసితివే
   దర్శించే కృపను,ఉజ్జివ కృపను చూపితివే
                          పాట -4
పల్లవి: నిను గూర్చిన నూతన స్తుతి కీర్తనా
         నా నోట నుంచుమయ్య స్తోత్రర్హుడా
         నా నోట నుంచుమయ్య స్తుతులకు పాత్రుడా
అ.ప.: మా నోట నుంచి నీ ధన్యతను మాకు నోసగుమయ్య  
         మా నోట నుంచి నీదివేనలన్ మాపై కుమ్మరించు
*   నిను గూర్చిన కీర్తనయే ఆనందము నిచ్చునది 
     సంతోషంనిండి పరవశులమై మేము నిను  కీర్తించెదము
*   నిను గూర్చిన కీర్తనయే ఉజ్జివము నిచ్చునది
     నియందుమేముండి నీ  ఆత్మకలిగి నిను కీర్తించెదము
*   నిను గూర్చిన కీర్తనయే నీ రాజ్యము తెచ్చునది
     సత్యం చేతభుని మేమేళ్ళు చోటను నిను కీర్తించెదము
               పాట -5

పల్లవి: నా హృదిలో నీ స్తుతి గీతం ఆనందదాయకము
          సప్త స్వరాలతో స్తుతి పాడెదను
         కోటి స్తుతులతో కొనియాడి పాడెదను
అ.ప.: స్తుతిఇంతు  అనుక్షణము   కీర్తింతు ప్రతి దినము    
      * జిహ్వా ఫలములన్ అర్పించేదము
         ప్రచురము చేసెదన్ నీ గుణ గణములన్
      * స్వేచార్పణలన్ అర్పించేదను
        మహిమ పరతు నిను మా నడవడితో
    * బాల్యార్పణలను అర్పించెదను
       మా సర్వమును సజీవయాగముగన్

          పాట-6
పల్లవి: ఉజ్జివము నిచ్చే మా రక్షక మమ్ము స్తిరపరచి బలపరచి నడిపించుము
          మేము యేసుని బాటలో పయనించెదము యేసుని ప్రేమను ప్రకటించేదన్
అ.ప .: వెనుదిరుగము ఏ మాత్రమూ ముందుకు సాగెదమ్ నీ జీవ మార్గం లో

    *    కయీను వలే మేము సహోదరులను ద్వేషింపను
          స్తేఫను వలె  మేము శత్రువుల కొరకై ప్రార్దిన్ చెదన్ 
  *     సంసోను వలె మేము వ్యబిచర ఉచ్చులో  ఉండక
        యెసెపు వలె మేము పాపం నుండి పారిపొయెదమ్
 *    యెహోషువ కాలేబు వలె శత్రువులకు మేము బయపడక
       షడ్రాక్ మేషాక్ అభేద్నాగో ల వలె నీ యందు నిలిచేదము
                          పాట -7
పల్లవి: కవచం సర్వాంగ కవచం -ఇది దేవుడిచ్చే సర్వాంగ కవచం
       దురాత్మల సముహముతో పోరడు యుద్దొపకరముల్
అ. ప. : దరించుకోన్నావా నీవు దరించుకోన్నావా?
          పోరాడుచున్నావా నీవు  పోరాడుచున్నావా?  
*రొమ్ముకు నడుముకు సత్యమను దట్టిని
 నీతి యను మైమరుపును          
*పాదములకు సిద్దమనస్సాను జోళ్ళను
 విస్వసమనే డాలును                
*రక్షణయను శిరస్త్రాణమును
 దేవుని వక్యమను ఆత్మ ఖడ్గమును
                        పాట -7
పల్లవి: సింహాసనాసీనుడా  స్తుతి  సింహాసనాసీనుడా
          రాజుల రాజా  ప్రభువుల ప్రభువా మహిమాస్వరూపుడా
1. నీవు సర్వోన్నతుడవై యుండి  మనుజుడుగా పుట్టావయ్యా
    తగ్గించుకోన్నావయ్యా మాకై తలవంచుకున్నావు

2. నీవు సర్వశక్తిమంతుడై యుండి శక్తిహీనునిగా చేసుకున్నావు
    విధేయత చూపవయ్య మాకై విజ్ఞాపనలు చేయుచున్నావు

3. నీవు సర్వసృష్టికర్తవై యుండి నీ సర్వమును అర్పించావు 
    క్రూర శ్రమలను  అనుభవించవయ్యా  సులువైన మార్గమును  చూపావు

                                     పాట -8

       రక్షణ రక్షకుడే నా  యేసుడు దేవాతి దేవుడైన నా యేసుడు
       మోక్షమునకు
       మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము ఆయనే నా యేసుడు 

1. నారక్షణ కర్తవంటి దేవుడేడి  పాపులకై ప్రాణమిఛ్చి రక్షణనిచెన్
    ప్రేమమయుడు దయామయుడు కరుణామయుడు నన్ను కరుణిచెన్

2. నా కాపరి వంటి దేవుడేడి జీవఆహార జలములనిచ్చుచుండున్
    పోషకుడు సహాయకుడు సర్వోపకారి నన్ను పోషించుచుండున్

3. నా పరిశుద్ధుని వంటి దేవుడేడి కామక్రోధమదమత్సరముల్  లేని వాడు
    పావనుడు పవిత్రుడు జీవాదిపతియైన నా దేవుడు

4. సర్వజనములలో నన్ను ప్రత్యేకించెన్ ఆయన రాజ్యమునకు తీసుకువెళ్ళుటకు
    సంతోషమే సమాధానము హర్షించెదన్ ఆనందింతును



                                                                                దేవుని కృపాలతో 
                                                                              ఇట్లు ప్రభువునందు మీ
                                                                            కాటం ఇమ్మానుయేల్ రాజు

No comments:

Post a Comment