Thursday 14 July 2016





Did you know How special you are to the Lord !
Did you know why God created you !!
Did you know how much god loving you !!!!

If you want know least something,Go through this references and get vision.

Ephesians2:22     II Chorinth 6:18-20    Romans8:17    I peter2:9

I Chorinth 6:3    Heb4:15       Spalms 116:15     Philip3:20  Ephesi 3:8  

Thursday 31 March 2016

                              ఆత్మీయ అభివృద్ధి పత్రిక                    

                    అపో. కా. 15:31   వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి                                                                        అంశం :ప్రేరేపణ                                     

    ప్రభవు నందు ఈ నా రెండవ పత్రికను చదువుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయ పూర్వక శుభాబివందనములు
ప్రేరేపణకు పర్యాయ పదాలుగా పురికొల్పడం, రేపడం,ఉజ్జివించడం ఇంకా చుస్తే ఆత్మ పరితాపమోదడం, మరులు కొలపబడటం, ఇడవబడటం అనే మాటలను గమనిచాగాలము. ప్రేరేపణ అనగా ఒకరి ద్వారానో ఏదో ఒక దాని ద్వారానో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా నీలో కార్యం జరగడము.
  నేటి లోకంలో అనేకులు  ద్వారా  అనేక విషయాల ద్వార ప్రేరేపిన్చాబడుతున్నారు.ఎఫేసి 2:2 లో సాతాను ప్రేపించు శక్తికి అధిపతి అని చెప్పబడింది జాగ్రత్త వాని ప్రేరేపనకు గురికావద్దు.వారిలో ఉగ్రవాదం ద్వారా, చెడు అలవాట్ల ద్వారా,సినిమాల ద్వారా మరియు సీరియళ్ళ ద్వారా అనేకులు ఇలా నానా విదాలుగా ప్రేరేపించ బడుతున్నారు.ప్రేరేపించ బడినము అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఉదా :సీరియళ్ళు ,సినిమాలను తీసుకొంటే మనకు తెలియకుండానే మన నోటి నుండి ఆ మాటలు , పాటలు ఆ ప్రవర్తన రావడము గమనించవచ్చు.సాతాను చేత ప్రేరేపించ బడటంను మరులు కొలపబడటం, ఇడవబడటంగ చెప్పాబడింది.యాకోబు 1:14 ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఇడవబడి మరులుకోల్పబడిన వాడై శోదింపబడును. క్రైస్తవులమైన మనము ఇలాంటి వాటి చేత ఇడవ(ప్రేరేపించ) బడుచున్నమా?దేవుడు తన మాటలతో సాతాను క్రియల చేత ప్రేరేపించ బడవద్దు అని చెపుతున్నాడు.సామెతలు 1:10 నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.
                   బైబిల్ గ్రంధంలో మనం ప్రేరేపణ అనే విషయాని గమనించినట్లైతే అరువది సార్లకు పైగా వ్రాయబదినట్టు చూడవచ్చు. మొట్ట మొదటగా ప్రేరేపణ అనే మాట మనం నిర్గమ ఖండము లో దేవుడు తన ఆలయ పని నిమిత్తం ప్రేరేపిస్తున్నట్టుగా చూస్తాంఎజ్రా 1:5 ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించేనో వారందరూ వారితో  కూడుకొని వచ్చి యెరుషలెము లో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు పునుకోనిరి.ఇంకా చుస్తే దేవుడు తన పని నిమిత్తం తన వాక్కు ద్వారా ప్రేరేపిస్తున్నాడు కానీ ఎవ్వరు కూడా ఆయన మాట వినటం లేదని దేవుడు ఆరోపిస్తున్నాడు నిజంగా నువ్వు కూడా ఇలాగే ఉన్నావా?
జేకర్య 7:12 దర్మశస్థ్రమును, పుర్వికులైన ప్రవక్తల ద్వార సైన్యములకు ఆదిపతి అగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను, తాము వినకున్డునట్లు హృదయములను కురువిందమువలె  కటిన పరుచుకోనిరి. 
మనం దేవుని చేత ప్రేరేపించ బడిన వారమైన యెడల గోప్పకార్యములు చేసేదమని నూతన మనస్సు పొందిన  వారమగుదుము అని దేవుని మాటల ద్వారా తేలుసుకొవచ్చును.
అపో. కా. 6:10 మాటలాడుట యందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరిపలేకపోఇరి.
న్యాయదిపతులు 14:6యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగ అతడు కొదమ సింహమును మేకపిల్ల వాలే చిల్చేను.  
1సముయెలు 10:6,10 యెహోవా ఆత్మ నే మీదికి బలంగా దిగి వచ్చును, నీవు వారితో కలిగి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును.  
దేవుడు ఇంకను ఆలస్యము చేయుచున్నాడు అంటే అది నీ మనస్సు మర్పుకోసమే! రోమా 2:4 దేవుని అనుగ్రహము నిన్ను మరుమనస్సు నొందుటకు ప్రెరెపిస్తున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్య ర్యమును సహనమును దిర్ఘశాంతమును త్రునికరించుదువా? 
 మనం ప్రేరేపించ బడటం దేవుని గుర్చిన మాటను బట్టియే గాని మరి ఏ విషయంలోనూ ఎవరి చేతను ప్రేరేపించ బడకూడదు,నీతిమంతుడు కదిలింప బడడు అని దేవుని వాక్యము చెబుతుంది కానీ కొందరు ఇరుగు పొరుగు వారి మాటలకూ చిన్న చిన్న విషయాలకే కదిలింప  బడుతుంటారు
దేవుని మందిరములో ఒకరి ద్వారా ఒకరము దేవునిలో ప్రేరేపించబడలి .
హెబ్రీ 10:25 కొందరు మానుకోనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఒకనినోకడు హేచ్చారించుచు, ఆ దినము సమిపించుట మీరు చూచున కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు ప్రేమ చూపుకోను సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికోల్పవలేనని అలోచింతము. 
దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియనిగ్రహము గల ఆత్మనే గని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదని గమనించుకోవాలి. దేవుడు మానవున్ని యదార్థవంతునిగా సృజించాడు కానీ మానవుడు వివిధ తంత్రములను కల్పించుకొంచున్నాడు అని దేవుడు అంటువున్నాడు.పౌలు అంటువున్నాడు ఇంత గొప్ప సాక్షిసమూహము మనలను అవరించియుండగా సుళువుగా చిక్కులు పెట్టుపాపమును వదిలి పెట్టి విశ్వాసమునకు కర్తయుదానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగేత్తేదము.            
2తేస్సలోనిక 3:5 దేవుని నందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ఫ్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక.  
  సహోదరులందరికి ఈ పత్రిక చదివి వినిపించావలేనని ప్రభువు పేర మీకు ఆన బెట్టుచున్నాను1తేస్సలోనిక 5:27

 సహోదరి సహోదరులారా యీ  పరిచర్య కొనసాగా బడుటకు మీ ప్రార్ధనలలో జ్ఞాపకం చేసుకోనుడి .
                        ఈ పత్రిక గూర్చి మీ అభిప్రాయములను తెలియ జేయుడి .
                   దేవుడు ఈ చిన్నిపత్రికను  దీవించి మీతో మాట్లాడునుగాక! ఆమెన్

                                                                                                                          ఇట్లు

                                                                                                    ప్రభువునందు మీ సహోదరుడు
                                                                                                      కాటం  ఇమ్మనుయేలు  రాజు
                                                                                                     8500411860,9618336621 
              
                












Wednesday 23 March 2016

యవ్వనుల ఆత్మీయ గీతాలు

 సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబందమైన పద్యములతోను ఒకనినోకడు బొదించుచు, బుద్ది చెప్పుచు దేవుని గూర్చిన గానము చేయుచు,సమస్త విదములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్దిగా నివసిమ్పనియ్యుడి.     కొల్లోస్సి 3:16
      
                               పాట -1
. పల్లవి :  నీ మాటలను వీనిపించు చున్నావు
              నీ వాక్యముతో బలపరుచు చున్నావు
 అ . ప.:  వాక్యమై మా మద్య నీవసించు చున్నావు
             ఆదరణ పొంది నీ కొరకు  బ్రతుకుదుము

      *    వాక్యమై మాకు వెలుగై యున్నావు
            నీ వెలుగులో మేము సరిదిద్దుకొందుము  
     *    వాక్యమై మాకు సత్యమై  యున్నావు
           నీ సత్యములో జ్ఞానము పొందెదము      
    *   వాక్యమై మాకు  జీవమై యున్నావు
         నీ జీవము పొంది స్తోత్రించేదము             
   *   వాక్యమై మాకు మార్గమై యున్నావు
        నీ రాజ మార్గములో చక్కగా నడిచెదము

                            పాట -2
            మహోన్నతుడా సత్యస్వరుపుడా జీవముగల దేవుడా రోషము గల దేవుడా  
            నీ ప్రేమే నను ఆకర్షించినది నీ కృపయే నను కాపాడుచున్నది             
 పల్లవి : చూచు చున్న దేవుడా నీవే నా యేస్సయ్య
            మమ్ము కాపాడువాడవు నీవే
        *  పరిశుద్దుడవు పరలోక రాజువు
           పావనుడ పవిత్రుడా నా యేస్సయ్య
            నీవు పరమందు ఉన్నవాడవు      
      *  అత్యున్నతుడా అతిసుందరుడా 
         దవలవర్నుడా రత్నవర్నుడా
         నీ కన్నులు అగ్ని జ్వలాల వంటివి   
    *  నిత్యుడగు తండ్రి బలమైన దేవా 
        సైన్యములకు అదిపథివి న యేస్సయ్య 
        బలశౌర్యములు నీవే                   
  *   అద్బుతకరుడా ఆశ్చర్యకరుడా 
      ఆలోచనా కర్తవు నా యేస్సయ్య   
      ఉహకందనివాడవు                    
 *   కరుణామయుడవు కృపామయుడవు 
     జాలి చూపువాడవు నీవే నా యేస్సయ్య 
     దయామయుడవయ్య                
                      పాట -3
పల్లవి: కృప చూపు వాడావ్ నీవు నీవే దయ చూపు వాడావ్ నీవు        
        స్తుతులందుకోనుము  దేవా  మా ఆరాధనాలందుకో 
*   నీ కృప చూపి అభ్రహమును   విశ్వాసుల తండ్రిగా మార్చితివి
    వర్దిల్లు కృపను , హెచ్చించు కృపను చూపితివే
*  నీ కృప చూపి యాకోబును ఇశ్రాయేలు నీ ప్రజగా చేసుకొంటివే
    ఉన్నతంబగు కృప,ఆశిర్వాద కృపను చూపితివే
*  నీ కృప చూపి సౌలును  పౌలుగ నీ మాదిరిగా చేసితివే
   దర్శించే కృపను,ఉజ్జివ కృపను చూపితివే
                          పాట -4
పల్లవి: నిను గూర్చిన నూతన స్తుతి కీర్తనా
         నా నోట నుంచుమయ్య స్తోత్రర్హుడా
         నా నోట నుంచుమయ్య స్తుతులకు పాత్రుడా
అ.ప.: మా నోట నుంచి నీ ధన్యతను మాకు నోసగుమయ్య  
         మా నోట నుంచి నీదివేనలన్ మాపై కుమ్మరించు
*   నిను గూర్చిన కీర్తనయే ఆనందము నిచ్చునది 
     సంతోషంనిండి పరవశులమై మేము నిను  కీర్తించెదము
*   నిను గూర్చిన కీర్తనయే ఉజ్జివము నిచ్చునది
     నియందుమేముండి నీ  ఆత్మకలిగి నిను కీర్తించెదము
*   నిను గూర్చిన కీర్తనయే నీ రాజ్యము తెచ్చునది
     సత్యం చేతభుని మేమేళ్ళు చోటను నిను కీర్తించెదము
               పాట -5

పల్లవి: నా హృదిలో నీ స్తుతి గీతం ఆనందదాయకము
          సప్త స్వరాలతో స్తుతి పాడెదను
         కోటి స్తుతులతో కొనియాడి పాడెదను
అ.ప.: స్తుతిఇంతు  అనుక్షణము   కీర్తింతు ప్రతి దినము    
      * జిహ్వా ఫలములన్ అర్పించేదము
         ప్రచురము చేసెదన్ నీ గుణ గణములన్
      * స్వేచార్పణలన్ అర్పించేదను
        మహిమ పరతు నిను మా నడవడితో
    * బాల్యార్పణలను అర్పించెదను
       మా సర్వమును సజీవయాగముగన్

          పాట-6
పల్లవి: ఉజ్జివము నిచ్చే మా రక్షక మమ్ము స్తిరపరచి బలపరచి నడిపించుము
          మేము యేసుని బాటలో పయనించెదము యేసుని ప్రేమను ప్రకటించేదన్
అ.ప .: వెనుదిరుగము ఏ మాత్రమూ ముందుకు సాగెదమ్ నీ జీవ మార్గం లో

    *    కయీను వలే మేము సహోదరులను ద్వేషింపను
          స్తేఫను వలె  మేము శత్రువుల కొరకై ప్రార్దిన్ చెదన్ 
  *     సంసోను వలె మేము వ్యబిచర ఉచ్చులో  ఉండక
        యెసెపు వలె మేము పాపం నుండి పారిపొయెదమ్
 *    యెహోషువ కాలేబు వలె శత్రువులకు మేము బయపడక
       షడ్రాక్ మేషాక్ అభేద్నాగో ల వలె నీ యందు నిలిచేదము
                          పాట -7
పల్లవి: కవచం సర్వాంగ కవచం -ఇది దేవుడిచ్చే సర్వాంగ కవచం
       దురాత్మల సముహముతో పోరడు యుద్దొపకరముల్
అ. ప. : దరించుకోన్నావా నీవు దరించుకోన్నావా?
          పోరాడుచున్నావా నీవు  పోరాడుచున్నావా?  
*రొమ్ముకు నడుముకు సత్యమను దట్టిని
 నీతి యను మైమరుపును          
*పాదములకు సిద్దమనస్సాను జోళ్ళను
 విస్వసమనే డాలును                
*రక్షణయను శిరస్త్రాణమును
 దేవుని వక్యమను ఆత్మ ఖడ్గమును
                        పాట -7
పల్లవి: సింహాసనాసీనుడా  స్తుతి  సింహాసనాసీనుడా
          రాజుల రాజా  ప్రభువుల ప్రభువా మహిమాస్వరూపుడా
1. నీవు సర్వోన్నతుడవై యుండి  మనుజుడుగా పుట్టావయ్యా
    తగ్గించుకోన్నావయ్యా మాకై తలవంచుకున్నావు

2. నీవు సర్వశక్తిమంతుడై యుండి శక్తిహీనునిగా చేసుకున్నావు
    విధేయత చూపవయ్య మాకై విజ్ఞాపనలు చేయుచున్నావు

3. నీవు సర్వసృష్టికర్తవై యుండి నీ సర్వమును అర్పించావు 
    క్రూర శ్రమలను  అనుభవించవయ్యా  సులువైన మార్గమును  చూపావు

                                     పాట -8

       రక్షణ రక్షకుడే నా  యేసుడు దేవాతి దేవుడైన నా యేసుడు
       మోక్షమునకు
       మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము ఆయనే నా యేసుడు 

1. నారక్షణ కర్తవంటి దేవుడేడి  పాపులకై ప్రాణమిఛ్చి రక్షణనిచెన్
    ప్రేమమయుడు దయామయుడు కరుణామయుడు నన్ను కరుణిచెన్

2. నా కాపరి వంటి దేవుడేడి జీవఆహార జలములనిచ్చుచుండున్
    పోషకుడు సహాయకుడు సర్వోపకారి నన్ను పోషించుచుండున్

3. నా పరిశుద్ధుని వంటి దేవుడేడి కామక్రోధమదమత్సరముల్  లేని వాడు
    పావనుడు పవిత్రుడు జీవాదిపతియైన నా దేవుడు

4. సర్వజనములలో నన్ను ప్రత్యేకించెన్ ఆయన రాజ్యమునకు తీసుకువెళ్ళుటకు
    సంతోషమే సమాధానము హర్షించెదన్ ఆనందింతును



                                                                                దేవుని కృపాలతో 
                                                                              ఇట్లు ప్రభువునందు మీ
                                                                            కాటం ఇమ్మానుయేల్ రాజు

Thursday 3 March 2016

                                ఆత్మీయ  అభివృద్ధి పత్రిక 

       వారు దానిని చసువుకొని అందువలన  ఆదరణ పొంది సంతోషించిరి                                                                                         అ. పో.  కార్యములు  15:31

                    ప్రభువైన క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభువు నామమున మీ అందరికి నా  శుభాభివందనములు . ఆనాదిలోనే  జగత్పునాది  వేయబడకమునుపే తన ప్రేమ చేత నన్ను ఆకర్శించుకుని తన రక్షణను అనుగ్రహించిన దేవుడు.ఆ  దేవుని గూర్చిన కార్యము చేయుటకు నా ఆత్మ నన్ను తొందర పెట్టుచున్నది. అయన కొరకై ఏదో ఒక విదముగా వాడబడాలని ఉద్దేశ్యం తో బాల్యం నుండి నేను నేర్చుకున్న ,గ్రహించిన ,విన్న నాకు నేనుగా గ్రహిస్తున్నటువంటి దేవుని వాక్కును ప్రతి మాసం ఒక అంశం ద్వారా ఈ ఆత్మీయ  అభివృద్ధి పత్రిక తో మీతో పంచుకోవాలనే ఉద్దేశ్యం తో మీకు వ్రాస్తున్నాను 

                                       అంశం :వ్రాసుకోనుము

                        సంగితములతోను కీర్తనలతోను అత్మీయాసంబందమైన పద్యములతోను ఒకనికి ఒకడు భొదించుచు ,బుద్ది చెప్పుచు దేవుని గూర్చిన గానము చేయుచు ,సమస్తవిదములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్దిగా నివసిమనియ్యుడి.   కొలోస్సి 3:16
వ్రాయబడుట,వ్రాసుకోనుము,వ్రాయుము ,ముద్రింపుము మరియు లిఖించుము అనే పదాలను బైబిల్ గ్రంధంలో మనం గమనించినట్లైతే పాత నిబందన గ్రంధంలో 22 పుస్తకములలోను ,క్రొత్త నిబందన గ్రంధంలో 27 పుస్తకములలో మొత్తం 279 అద్యయాలలో 456సార్లులకు పైగా  కనబడుతునట్లుగా చూడవచ్చును.  బైబిల్ గ్రంధం లో ఇన్ని సార్లు కనబడుతున్నదంటే ఎంత ప్రాముఖ్యమైన మాటో మనం  అర్ధం చెసుకొవ్వలి.
మొదటగా వ్రాయబడుట అనే మాటను నిర్గమ 17:14లో చుడవచును  అక్కడ దేవుడు మోషేతో నేను జరిగించు కార్యం గురించి వ్రాసి వినిపించుము అని చెపుతున్నాడు .
రెండవదిగా నిర్గమ 24:4లో మోషే దేవుని మాటలన్నింటిని వ్రాసి ప్రజలకు వినిపించినట్లుగా చుస్తము.
మూడవదిగా నిర్గమ 24:12,31;31:18;32:15,16 లలో మహోన్నతుడైనటువంటి దేవుడే మానవ జీవితాలను క్రమ పరచేందుకు స్వయానా తన స్వహస్తాలతో వ్రాసి ఎస్తునట్లుగా చుడవచును .
                                   అవిదముగ దేవాతి దేవుడు ఆనాటి కాలములోనే తన ఆత్మ ద్వారా అనేకుల చేత జీవం గల తన వాక్కును వ్రాయించి మనకు ఇచ్చాడు. మలాకి 3:16,యోహాను 20:30,31,అ.పొ  కార్యం 1:1,2;15:4,రోమ 15:4,   2కోరింథు 3:2,3,2పేతురు 1:21 లలో మనం తేటగా గమనించవచ్చు .అవి నేటికి మనకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయ్,మరి ముఖ్యంగా క్రొత్త నిబందన గ్రంధంలోని పుస్తకాలు మనం క్రీస్తు రక్షణ వెలుగులోనికి ఎలా నదిపించగలము వ్రాయుట అనే శ్రేష్టమైన కార్యం ద్వారా దేవుడు నేటికి తన ప్రేమగల తన రక్షణను మన మద్య ఉంచి వ్యాక్యరుపిగా మనమధ్య నివసిస్తూన్నడు .ఇంకా గమనిస్తే మన ప్రభువైన క్రీస్తు(యోహాను 8:6-8) కూడా తన వ్రేలితో వ్రాస్తున్నట్లుగా గమనించగలము ,మన ప్రభువైన క్రీస్తు కలిగిన అ గునంను మనంను కలిగి ఉందాము .
                                 దేవుని మాట సెలవిస్తునట్లుగా ద్వితి 11:18-20 కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములలోనూ మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చెతులమీదను సుచనులుగ కట్టుకోవలెను ,అవి మీ కన్నుల నడుమ భాసికలుగా ఉండవలెను ,నీవు నీ ఇంట కూర్చుండునపుడును త్రోవను నడుచునప్పుడును పడుకోనునపుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబందకముల మీదను నీ గావునుల మీదను వాటిని వ్రయవలెను.
                                  మన ప్రభువైన క్రీస్తు సాతాను చేత శో దించబదుచున్నప్పుడు సాతనుకు సమాధానంగా వ్రాయబదియున్నదిగద అని చెప్పినట్లుగా చూస్తాం . ఇందులో మనం గమనించ వలసినవి ప్రాముఖ్యంగా రెండు ఉన్నవి అవి ఏమిటంటే మొదటగా శోధనలను మనం వాక్యంతో జయించాలిరెండవదిగా వ్రాయబదియున్న దానిని పాటించాలి.దానికి మనం ఏంచెయ్యాలి అంటే మనల్ని ఆకర్షించిన వాక్యంను వ్రాసుకోవాలి నేర్చుకోవాలి.
ద్వితి 31:19 కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయెలియులకు నేర్పుడి ఈ కీర్తన ఇశ్రాయెలియుల మీద నాకు సాక్షార్దంగా నుండునట్లు దానిని వారికీ కంరపారముగా చెయుంచుము. ఈ వ్యాక్యమును బట్టి మనం వ్యాక్యమును కంరపారము చెయ్యాలి దేవుడు మనకు చెప్పకనే చెపుతున్నాడు.
యోహోషువ 1:8 వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దీవారత్రము దానిని ద్యానించిన యెడల నీ మార్గమును వర్దిల్ల చేసుకొని చక్కగా ప్రవర్థించెదవు .
కీర్తన 1:1 యెహోవ ధర్మ శాస్రమందు ఆనందించుచు దీవారత్రము దానిని ద్యానించువాడు ధన్యుడు.
ద్వితి 17:22 దేవుడైన యెహోవాకు బయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఈ కటడలను అనుసరించి నడుచుకోనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంధమును చదువుచుండ వలెను.  
పై వాక్యములను బట్టి దేవుని వాక్యమును ఎల్లప్పుడును ద్యానించాలి.
                  దేవుని వాక్యంను వ్రాసుకోనుటకు విసుగు చెందకూడదు, నిర్గమ 34:1 నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రసెదను. దేవాతిదేవుడు మానవులను క్రమపరచుటకు ఎంత శ్రద్ధ చుపుతున్నాడో ఇక్కడ మనకు అర్ధం అవుతుంది. అయన మరల మరల వ్రాసి ఇస్తాను అన్తున్నడు. 
     మరి ఈ యుగములో దేవుడు మన హృదయములపైన తన మాటలను వ్రాయాలని ఆశపడుతున్నాడు,మరి దేవుని వాక్యము నీ హృదయములో వ్రాయబడుతుందా?జాగ్రత్త  
అ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబందన ఇదే నా ధర్మములను వారి హృదయమునందుంచి  వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. హెబ్రీ 10:16
       ఈ సంగతులు ద్రుష్టంతములుగా వారికీ సంబవించి యుగామందున్న మనకు బుద్ది కలుగుటకై వ్రాయబడెను.  1కోరింథి 10:11
                                                1థెస్సలోనిక 5:27 
     సహోదరులందరికి ఈ పత్రిక చదివి వినిపించావలేనని ప్రభువు పేర మీకు ఆన బెట్టుచున్నాను

అనేక విషయములు వ్రాయాలనే ఆశ వున్నదికాని వ్రాయలేక పోవుచున్నాను ప్రభువు చిత్తం ఐతే మరొకసారి వ్రాసెదను . సహోదరి సహోదరులారా యీ  పరిచర్య కొనసాగా బడుటకు మీ ప్రార్ధనలలో జ్ఞాపకం చేసుకోనుడి .

                        ఈ పత్రిక గూర్చి మీ అభిప్రాయములను తెలియ జేయుడి .
                   దేవుడు ఈ చిన్నిపత్రికను  దీవించి మీతో మాట్లాడునుగాక! ఆమెన్

                                                                                                                          ఇట్లు

                                                                                                    ప్రభువునందు మీ సహోదరుడు
                                                                                                      కాటం  ఇమ్మనుయేలు  రాజు
                                                                                                       8500411860,9618336621