Tuesday 19 March 2019

విశ్వాసము

విశ్వాసము
యేసు క్రీస్తునందు విశ్వాసము వలన దేవునితొ సమాధానము(రోమా 5 : 1 )
యేసు క్రీస్తునందు విశ్వాసము వలన నీతిమంతులముగా తిర్చబడుదుము(రోమా 3 : 26 )
యేసు క్రీస్తునందు విశ్వాసము వలన దేవుని కుమారులమవుదుము(గలతి 3 : 26 )
 గత మాసము సమాధానము గూర్చి ధ్యానించుకొన్నాము, అందులో దేవుని సమాధానము కలిగి ఉండాలంటే మనము వేటిని కలిగియుండాలి అని చెప్పుకున్నాము. వాటిని ఒక్కొక్కటిక ధ్యానించడానికి ప్రయత్నిద్దాం.
దేవుని సమాధానము కలిగి ఉండాలంటే మనము కలిగి ఉండవలసినవి
1. విశ్వాసము       2.ప్రార్థన   3. వాక్యం     4. సహవాసము    5. హృదయమందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుట
6. దేవునిగూర్చి ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానము   7. సమస్తశిక్షయందు అభ్యాసము 


 
విశ్వాసము యొక్క నిర్వచనం:         విశ్వాసమనునది నిరిక్షీంపబడువాటి యొక్క నిజస్వరుపమును లేనివి ఉన్నవనుటకు రుజూవునైయున్నది.– హెబ్రి11 :1

               ప్రతి మానవుడు ఎదొఒక విషయముపై విశ్వాసాన్ని కలిగి యున్నాడు. ఉదహరణకు మనం రోజు ధనం కూడబెడుతున్నాము అంటే రేపు అది మనకు ఉపయొగ పడుతుందనే నమ్మకం, కాని వాస్తవానికి రేపు అనే దినము మనకు ఉంటుందో లేదో తెలియదు, ఒక దినమున తనకు తెలియకుండ వివిద కారణాల చేత ఎంత మంది తనువులు చాలించి లోకం విడచి వెళ్లి పొతున్నారో మనకు తెలిసినవిషయమే. అయినను మనం రేపటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ధనమును కూడబెట్టుకుంటున్నాము, చదువులు చదువుతున్నాము,ఉద్యోగాలు చేస్తున్నాము, ఆరోగ్యంను కాపాడుకుంటున్నాము, అనేకమైన పనులు చేస్తున్నాము రేపనేది మనకు ఉందనేదె నమ్మకమంటె. కాని బైబిలు చెపుతున్న విశ్వాసం ఎంతో ఉన్నతమైనది అది దైవికమైన విషయాలకు సంబందించింది. అది మానవ మేథస్సుకు అందని విషయాలపైన ఉండేది ఈ విశ్వాసము కలిగి ఉండాలంటే దేవుని ఆత్మను మానవుడు కలిగి ఉండాలి.
          దృశ్యమైనది కనబడెడు పదార్థములచె నిర్మించబడలేదని గ్రహించగలిగె సామాన్య విశ్వాసము :

  వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమా 10 : 17

            ఉదహరణకు హైడ్రోజన్, ఆక్సిజన్ రెండూ కనబడనివే కాని రెండింటి మధ్య రసాయనిక చర్య ద్వారా కనబడెడు పదార్థమైన నీరు వస్తుంది. H2+ O = H2O (నీరు) ఇందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచె నిర్మించబడలేదని స్పష్టమవుచున్నది, ఇందునుబట్టి అదృశ్యమైన వాటి నుండి దృశ్యమైనవి వచ్చినవని గమనించవచ్చును, దీని వలన ప్రపంచములు దేవుని వాక్యమును బట్టి నిర్మింపబడినవని విశ్వాసము ద్వారా గ్రహించవచ్చును. కావున అదృశ్యమైనవి నిత్యములని దృశ్యమైనవి అనిత్యములని లేఖనాలలో(2కోరిథి 4:18)చూస్తాము. విశ్వాసము ఆత్మ సంబందమైన వాస్తవాలము నమ్ముతుంది.దేవుడు విశ్వాసికి సిద్దపరచిన మేలులు దీవెనలు అశిర్వాదాలు మొదలగునవి అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడ లేదు, మనుష్య హ్రుదయమునకు గోచరము కాలేదు అని హ్రయబడియున్నది. ఇట్టి కనబడని వినబడని గోచరము కాని అన్నిటిని, దేవుని మర్మములు కూడా  పరిశొదించు ఆత్మను అనగా దేవుని ఆత్మను విశ్వాసము ద్వారా మనం పొందుకుంటాము, ఆత్మనుభవము ద్వారానే అన్నింటిని వివేచించె గ్రహించె శక్తిని పొందుకొనగలము. అదే ఆత్మీయపరమైన విశ్వాసము చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులని యేసు ప్రభువు ధన్యమైన విశ్వాసము వివరించాడు.

  వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమా 10 : 17
  
V రక్షణనిచ్చె విశ్వాసము (ఎఫెసీ 2 : 8)నమ్మువానికి సమస్తము సాధ్యమేనని బైబిలు చెప్తుంది. మారుమనస్సంటే దేవుని తట్టు తిరుగుట దేవుని క్షమాపణను రక్షణను పొందడానికి మారుమనస్సు అనేది విశ్వాసము వలనే వస్తుంది. బైబిలు విశ్వాసమును గూర్చి ఎంతో చెప్తుంది. యేసు క్రీస్తు భూమి మీదకు వచ్చినప్పుడు ప్రజలు దేవుని యందు విశ్వాసముంచాలని వారిని ప్రోత్సహించాడు. నిజానికి ఆయన పరిచర్య అంతటిలో దేవుని యందు విశ్వాసముంచు నేది ఒక ప్రధాన నేపథ్యంగా ఉండెను. మనం విశ్వసించని యెడల దేవుని క్షమాపణను పొందుకొనలేము, క్షమాపణను సంపాదించడానికి క్రియలను చేయనక్కరలేదు. క్రియలతో, డబ్బుతో, తీర్థయాత్రలు వంటి అనేకమైన వాటితో క్షమాపణను సంపాదించలేము. ఎందుకనగా క్షమాపణ చాలా ఖరీదైనది, దానికి మనం వేల కట్టలేము కావున దేవుడు తన క్షమాపణను మనకు ఉచితముగా ఇస్తున్నాడు. ఉచితముగా ఎందుకు? ఎందుకంటే అది ఎంతో విలువైనది, ఎంత ఖరీదైనదంటే మనం ఎన్ని మంచి పనులు చేసినా దాన్ని కొనుక్కోలేము ఒక్క విశ్వాసము ద్వారా తప్ప.
V జీవార్థమైన మారుమనస్సు కలిగించె విశ్వాసము –( .కా.11 : 18) విశ్వాసము జటిలమైన విషయం కాదు, దానర్థం కేవలం మన చేతిని చాపి దేవుడు మనకిస్తున్న వాటిని అందుకోవడమే. మనం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డామని ఎఫెసీ 2: 8 లో చెప్పబడుతుంది. కృప మరియు విశ్వాసము రెండు మనం క్రొత్త నిబంధనలో చూచే రెండు ముఖ్యమైన పదాలు దీని అర్థం చాలా సుళువైనది. కృప అంటే దేవుడు చేతిని చాచి మనకు ఆయన సహాయాన్ని, ఆయన ఆశీర్వాదాలను ఆయన క్షమాపణను, మనం జీవితంలో ఎదుర్కొనబోయే ప్రతి పనికి బలాన్ని అందించుట అది దేవుని కృప. విశ్వాసమంటే ఏమిటి? విశ్వాసమంటే దేవుని చేతుల్లో నుండి సహాయాన్ని ఆశీర్వాదములను తీసుకోవడానికి మన చేతులను పైకి చాచుట. దేవుడు బలవంతంగా దేన్నీ మన గొంతులోనికి తోయడు, మనకు వద్దన్న వాటిని అంగీకరించుటకు ఆయన మనలను బలవంతం చేయడు. ఎందుకంటే ఆయన మనకు ఎంచుకొనే స్వేచ్ఛనిచ్చాడు, ఆయన చెప్పినట్లు చేసే మతిలేని మనుష్యులు ఆయనకు వద్దు. మనం ఎంచుకోవాలని ఆయన కోరుచున్నాడు, నేను విశ్వసించడానికి ఎంచుకొన్నప్పుడు నేనొక ఎంపిక చేసుకొన్నాను. ''ప్రభువా, క్రీస్తు నా పాపాలకొరకై మరణించి మృతులలోనుండి లేచాడని నేను నమ్ముచున్నాను, ఆయనను నా ప్రభువుగా అంగీకరిస్తున్నాను'' అని నేను చెప్తాను. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఉన్న శక్తిని గూర్చి బైబిలు చెప్తుంది. భూమి మీద ఇంకా ఇతర నామం ద్వారా మనం క్షమాపణను గాని రక్షణను గాని పొందలేము. మీరు కేవలం మీ చేతిని చాపితే మీరు వాటిని పొందవచ్చు. వేరే మాటల్లో చెప్పాలంటే, మీరు ప్రభువుతో, ''యేసు ప్రభువా, నేను పాపిని. నా పాపాలనుండి నేను వెనుదిరగాలనుకొను చున్నాను, నా కోసం నీవు మరణించావని నమ్ముచున్నాను'' అని చెప్పుము. అది ఒక సామాన్యమైన ప్రార్థన. అలా ప్రార్థన చేయడానికి నీకు నిమిషం కూడా పట్టదు. కాని నీవు యథార్థంగా ప్రార్థిస్తే నీవు ఒక్క క్షణంలో దేవుని బిడ్డవు కాగలవుఇది ఒక మంత్రము కాదు, చూడండి. దేవుడు కొన్ని ప్రత్యేకమైన పదాలకొరకు చూడటం లేదు. ఒక తండ్రి తన బిడ్డ మాటలను వింటున్నప్పుడు, బిడ్డ ఒక సూత్రాన్ని చెప్తున్నాడా, సరైన భాషతో మాట్లాడుతున్నాడా అని చూడడు. బిడ్డ యొక్క వ్యాకరణమును గూర్చి కూడా పట్టించుకోడు. బిడ్డ హృదయ వాంఛల యొక్క వ్యక్తీకరణయైన బిడ్డ మాటలను తండ్రి వింటాడు. లేఖనాలంతట మనము నియమాన్ని చూడగలము.
V     స్వస్థతనిచ్చె విశ్వాసము- (అ.కా. 3 : 16; 4 : 9; లూకా 17 : 19) మత్తయి 9 అధ్యాయములో ఇద్దరు గ్రుడ్డివారు యేసు యొద్దకు వచ్చి వారి గ్రుడ్డి కళ్లను స్వస్థపరచమని వారు యేసును అడిగారు. వారి గ్రుడ్డి కళ్లను తెరువగల శక్తి యేసుకున్నదని వారు యెరిగి వారు వచ్చి అలా చేయమని ఆయనను అడిగారు. వారి కొరకు అలా చేయుట యేసుకు ఇష్టమే. వారు కూడా దాన్ని పొందుకోవడానికి ఎంతో ఆశ కలిగియుండిరి. అయినప్పటికి యేసు వారిని మరొక ప్రశ్నను అడిగాడు, ''నేను మీ కొరకు ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా?''. చూడండి, దేవునికి మనతో ఉన్న వ్యవహారాలన్నిటిలోను ఇదే నియమము. మొదట ఆయన మనలను ఒక ప్రశ్న అడుగుతాడు. అతనివైపు తెరి చూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి (.కా.14:9) ఆయన వలన కలిగిన విశ్వాసమే వీనికి పూర్ణస్వస్థత కలుగజెసెను( .కా.3 : 16)
V క్షమాపణనిచ్చె విశ్వాసము(లూకా 5 : 20; మార్కు 2 : 5) మీరు మొదటిగా క్షమాపణ అడిగారనుకొందాము. మనం ఆయన్ని అడిగే మొదటి విషయం అదే. ''నేను నిన్ను క్షమిస్తానని నీవు నమ్ముచున్నావా?'' అని ఆయన అడుగుతాడు. ''ప్రభువా, నాకు ఖచ్చితంగా తెలియదు'' అని నీవు చెప్తే, నీకు క్షమాపణ దొరకదు. మనం మత్తయి 9:27-29 వచనాలలో చదివిన గ్రుడ్డి వారి వలే, వారు వచ్చి వారి కళ్లు తెరువబడాలని వారడిగినప్పుడు, యేసు వారిని ''నేను మీ కోసం దీన్ని చేయగలనని మీరు నమ్ముచున్నారా?'' అని అడిగాడని మనం చదువుతాము. రాబోయే రోజుల్లో మనము కట్టబోయే అద్భుతమైన కట్టడమునకు కేవలం ఒక పునాది వేయడం మాత్రమే, అది పునాది మన గత చెడ్డ ఖాతాను మూసివేయడము మన అపరాధ భావమును తీసివేయడము మన ఋణమును చెల్లించడము పాత బకాయిలను చెల్లించడము ఇదంతయు విశ్వాసముతో కూడిన మారుమనస్సుతొ మొదలవుతుంది.
               నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునని ప్రభువు చెప్పుచున్నాడు, అదే పొందుకోవడానికి పొందకపోవడానికి గల తేడా. బయట వర్షం పడటం మీరు చూస్తారు మీరు బయటకు చిన్న గిన్నెను తీసుకువెళతారు, వేరొకరు ఒక బక్కెట్టు తీసుకువెళతారు, మరొకడు ఒక పెద్ద డ్రమ్మును తీసుకువెళతాడు, వారు ఇంటిలోకి తిరిగొచ్చినప్పుడు, ఎవరికి ఎక్కువ నీరుంటుంది పెద్ద డ్రమ్ముతో వెళ్లినతనికే కాని దేవుడు అతనికి ఎక్కువ ఇచ్చాడని లేక దేవుడు అతనికి పక్షపాతం చూపించాడని మీరు చెప్పలేరు. మీరు ఒక చిన్న గిన్నెతో వెళ్లబట్టి మీకు అంతే దొరికింది. వేరొకడు పెద్ద డ్రమ్ముతో వెళ్లబట్టి అతనికి మరెంతో దొరికింది అదంతే విశ్వాసం అలాగే ఉంటుంది, దేవుని దీవెనలు అందరికి ఉన్నాయి. ఆయన పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు, కాని మీరందరూ ఒకేవిధంగా పొందుకోరు. అది మీ విశ్వాసంపైన ఆధారపడియుంది. ప్రభువా, నీవు నమ్మకస్తుడవని నేను నమ్ముతున్నాను అని మీరు చెప్పాలి, విశ్వాసము దేవుణ్ణి ఘనపరచును అందుచేత విశ్వాసము ఎంతో ముఖ్యమైనది. మనము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు చులకని శ్రమకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజెయు చున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు.- 2 కొరిథి 4 : 17,18 
                               క్రైస్తవుడు అవ్వాలంటే క్రీస్తునందు విశ్వాసము తప్పనిసరని మొదటగా క్రైస్తవ్యనికి మూలం విశ్వాసమని, విశ్వాసాన్ని దేవుని సన్నిది చేత దినదినము అభివృద్ది పొందుకొంచు చివరి శ్వాస వరకు దానిని కాపాడుకొనుచు కొనసాగించుకొవలి, విశ్వాసము లేని సమయన అట్టి వాడు తన అత్మీయ స్థితిలో చచ్చిన వాడే.     


విశ్వాసమును బట్టీ మన పితరులు సాక్ష్యంపొందిరని చూస్తాము, వారియొక్క సాక్ష్యంను బటి విశ్వాసమనేది ఏంటో ఎలాంటిదో అర్థం చేసుకుందాము కొందరి విశ్వాసుల జీవితాలనుబట్టి కొన్ని విషయాలు గమనిద్దాం.      
హేబెలు విశ్వాసపు ఆరాధన: మొదటి విశ్వాసి హేబెలు తన గొర్రెల మందలో తొలిచూలున పుట్టిన వాటిని, వాటిలోను క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి దేవునికి అర్పించెనని చూస్తాము, అది శ్రెష్టమైనబలి అని హెబ్రి 11:4 లో చెప్పబడింది. అవును అది శ్రెష్టమైనబలి ఆరాధనే ఎందుకంటే హేబెలు తొలిచూలున పుట్టిన వాటిని అనటంలో అతడు దేవునికి మొదటి ప్రాధాన్యతను ఇచ్చాడు అని అర్థమవుతుంది, క్రొవ్వినవి అనటంలో ఉత్తమమైన వాటిని బలిసిన వాటిని అర్పించాడు అని అర్థమవుతుంది, అదియుకాక అతడు ఒక ప్రాణి రక్తము చిందిస్తు అర్పించాడు.ప్రతి విశ్వాసి తన మొదటి పధార్థములు, మొదటి సమయం మొదటి విషయాలలో దేవునికి ప్రాధాన్యత ఇస్తాడు, అందులోను ఉత్తమమైనది సజీవమైన తన శరిరములను  మరి తప్పక దేవునికై ఇచ్చును.విశ్వాసమును బట్టి హేబెలు బలి అర్పించాడు, విశ్వాసము అతనికి ఎల వచ్చింది అని అలోచిస్తె అయితె అతడు ఎదెను వనములో ఆదాము హవ్వలు దేవునితొ మాట్లడినప్పుడు లేడు ఎదెను వనము నుండి గెంటివెయబడిన తర్వత కొన్ని సంవత్సరాలకు జన్మించాడు. తన తండ్రి ఆదాము దేవుని గూరించి చెప్పగా విన్నాడు విశ్వాసి అయ్యాడు వినుటవలన విశ్వాసము కలుగును నే మాట మనకు విదితమే. విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను, మ్రుతి పొందియు విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు.
హేబెలు విశ్వాసమును నుండి ఏమీ నేర్చుకొంటున్నాము?
* దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం * దేవునికి  శ్రెష్టమైనవి(సమయం,సజీవమైన శరిరము మరేదైన కావచ్చు) ఇవ్వడం
* దేవుని మాటలు వినడం * దేవున్ని మహిమ పరచడం* అంగీకార యొగ్యమైన ఆరాధన    
హనోకు విశ్వాసము: విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము హనోకు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను , సుదీర్ఘకాలం తాను బ్రతుకు దినములన్నిట దేవునితొ నడచుచు ఉండెను గనుక దేవుడు అతనిని మరణమును చూడకుండునట్లు కొనిపొయెను.దేవునితొ నడవటం అంటే ఆయను అనుసరించడం అనుక్షణం దేవునిమాటను బట్టి నడుస్తూ ఆయనతొ సహవాసము చెయ్యడం, ఇది విశ్వాసి విశ్వాసమును సజీవంగా ఉంచుతుంది వ్రుద్ది పొందింప చెస్తుంది.
హనోకు విశ్వాసమును నుండి ఏమీ నేర్చుకొంటున్నాము?


హెబ్రి 11 : 6 - దేవుని యొద్దకు వచ్చు వాని విశ్వాసము : ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచెయు వాడనియు నమ్మవలెను.


*దేవునితో నడవటం * దేవుని మాటలను అనుసరించడం* దేవునితో యెడతెరుపులేని ప్రయణం * దేవునితోడు ఉంటే మరణమును దాటగలమనే విశ్వాసము * దేవుని రాజ్యమునకు చెరుకొగలమనే స్పష్టత* దేవుని దగ్గర సాక్ష్యం కలిగి ఉండటం* దేవునితో సహవాసము చెయుట    





నోవహు విశ్వాసము : విశ్వాసమును బట్టి దేవుని ద్రుష్టికి క్రుపపొందినవాడాయెను, తన తరములో నీతిపరుడును నిందారహితుడునై యుండెను.విశ్వాసము చేత దేవునితొ నడచినవాడు. అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చెత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై,దేవుడు తనకు ఆజ్ఞాపించినప్రకారము యావత్తు చెసి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఒడను సిద్దము చెసెను. అందువలన అతడు లోకము మీద నెరస్థపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. విశ్వాసము అనేది లేని వారి మధ్య అల్లరి చిల్లరగా ఉన్న వారిమధ్య విశ్వాసిగా జీవించాడు.
నోవహు విశ్వాసమును నుండి ఏమీ నేర్చుకొంటున్నాము?
*నీతివంతముగా జీవించుట *నిందారహితమైన జీవితం * చూడని సంగతులను గూర్చి నమ్మడం *భయభక్తులు కలిగి జీవించుట
* దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చెయుట * మనుష్యులందరు తన ఇరుగు పొరుగు వారు విశ్వాసభ్రష్టులై దైవ భక్తి నుండి తొలగినను అదరని బెదరని కదల్చబడని స్థిరమైన విశ్వాసముతొ జీవించుట * ప్రత్యక్ష్యంగానో పరొక్షముగానో క్ష సువార్త ప్రకటించుట *ఇంటి వారిని రక్షించుకొనుట       
అబ్రాహము విశ్వాసము : విశ్వాసమును బట్టి దేవుని పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదెశమునకు బయలు వెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను.ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడొ, పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను. శొదింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. మ్రుతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యొంచినవాడై, తన కుమారుని అర్పించి, ఉపమాన రూపముగా అతనిని మ్రుతులలో  మరల పొందెను.  
అబ్రాహము విశ్వాసమును నుండి ఏమీ నేర్చుకొంటున్నాము?
*నిస్సాందెహంగా దేవుని నమ్ముట *దేవునికి లోబడే విధెయత*దేవుని నమ్ముట* విశ్వాసపు నడక* దేవుడు సమస్తమును దయచెయ సమర్థుడని అన్ని ఆయనే పొందుటకు అర్హుడని * పొగొట్టుకున్నది తిరిగి దయచెయువాడని * మన సొంత వారి కన్న దేవుని ప్రేమించుట ఎలాగో నేర్చుకుంటం *పరలోక పట్టణముకు ఎదురుచుచుట *తప్పక ఆయన మేలు చేయువాడని ఆయన ఎటు నడిపితె అటు నడవడవటం *దేవుని మాటకు శిరస్సావహించడం *దేవునికి లోబడి యుండుట శొదనను జయీంచుటకు మూలమని * భూలోకములో మనము యాత్రికులమని *మాట ఇచ్చి దేవుడు నేరవేర్చువాడని *    
ఇస్సాకు విశ్వాసము : ఇస్సాకు పొలములో సాయంకాలమున ధ్యానించువాడు. గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. విశ్వాసమును బట్టి జరుగబొవు సంగతుల విషయమై యాకొబును ఎశావును అశిర్వదించెను.
ఇస్సాకు విశ్వాసమును నుండి ఏమీ నేర్చుకొంటున్నాము?
*దినమున దేవుని ధ్యానించు సమయము స్థలము మనము ఎర్పరచుకొనుట * నిత్యమైన స్వాస్థ్యము పరమందున్నదని ఇహ లోక నివాసం శాశ్వతం కాదని * జరుగబొవు సంగతులను గూర్చి యెరిగిన వారుగా ఉండుట
యాకోబు విశ్వాసము : దేవుని మంధిరము పరలొకపు ద్వారము అని అది పాపమునకు ఎంతో భయంకరమైనదని, అందులోనికి ప్రవెశించు వారందరు దేవునికి సన్నిది భయం చేత అన్యదేవతలను(అన్య సాంప్రదాయాలు) విడచి తమను తాము శుచిపరచుకొని వస్త్రములను మార్చుకొని (నూతన మనస్సు కలిగి) ఉండాలని యాకోబు విశ్వాసము, అందుకనే దేవుని గూర్చి చెబుతూ నా తండ్రి దేవుడు, అబ్రహము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు అని చెప్పుకొస్తున్నాడు.అంతే కాక  శ్రమ దినమున ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైయుండిన దేవుడు అని చెప్పుచూన్నాడు.నేను పుట్టినది మొదలుకొని నేటివరకు నన్ను పోషించి, సమస్తమైన కీడులలో నన్ను తప్పించిన దేవుడు. యాకోబు దేవుడు లేకపోతే జీవితం లేదనుకున్నాడు అందుకనే అయన అశిర్వాదించాలని దేవదూతతొ రాత్రంతయు బలమైన గాయమైనను పోరాడి దేవుని అశిర్వాదాన్ని పొందుకున్నట్టుగా చూస్తాం.    
యాకోబు విశ్వాసమును నుండి ఏమీ నేర్చుకొంటున్నాము?
* దేవుని మంధిరము పరలొకపు ద్వారమని * అందులోనికి ప్రవెశించు వాడు ఎంతో భయం కలిగి ఉండాలని * మన శ్రమ దినమున దేవుడు మనకు ఉత్తరమిచ్చు వాడని * మన మార్గములో మనకు తోడై ఉంటాడని * దేవుని అశిర్వాదము లేకపోతే మంచి జీవితము ఉండదని * దేవుని దీవెనకై పోరాడాలని* దేవునికి మన హ్రుదయాలలో బలిపిఠము కట్టి ప్రార్థనలు చేసే వారుగా ఉండాలని *పోషించే దేవుడని * సమస్తమైన కీడులలో తప్పించ్చు దేవుడు
యోసేపు విశ్వాసము: తన సొంత అన్నల చేత ఐగుప్తునకు తాను దాసునిగా అమ్మబడిన కూడ తన దేవున్ని విడువలెదు అందుచేత దేవుడు యోసేపునకు తోడైయున్నాడు పాపం నుండి పారిపోయి తన పవిత్రతను కాపడుకొన్నాడు దానికి జైలుకు సహితం వెళ్ళవలసి వచింది. అయినను దేవునిపై విశ్వాసం ఏ మాత్రం వదలనివాడు, తనది కాని దేశంలో నా అనే వారు లేనప్పుడు దేవుడే నాకు సర్వస్వం అనుకున్నాడు. దానికి ఫలితంగా అంచలంచలుగా ఎదిగాడు పరాయి దేశంలో రాజంతటి స్థానంలో ఉన్నాడు, ఎడు సంవత్సరాల భయంకరమైన కరువు నుండి తన కుటుంబాన్ని పొషించడానికి దేవుడు ముందే నన్ను ఇక్కడకు పంపాడని విశ్వసించాడు.తన మరణ సమయం దగ్గర పడుతున్నప్పుడు దేవుడు నిశ్చయముగా మీకు దర్శనమిచ్చి మిమ్మును చూడవచ్చును; అప్పుడు నా ఎముకలను ఇక్కడనుండి తీసికొని పొవలెనని ఇశ్రాయేలియుల చేత రూఢిగా ప్రమాణము చేయీంచుకొనేను.     
యోసేపు విశ్వాసమును నుండి ఏమీ నేర్చుకొంటున్నాము?
*అందరు చేయి విడచిన దేవుడుని మనం విడువ కూడదని * ప్రతి శొదనలో వేదనలో దేవుని అశ్రయీంచడం * పాపం నుండి పారిపోయి పవిత్రతను కాపాడుకొవడం * దేవునికి విధెయులుగా ఉన్న వారిని అయన ఏంతవరకైనను హెచ్చించుగల సమర్థుడని * సమస్తము మన మేలు కొరకై జరిగించువాడని * జీవించడానికి ఆధారం లేనప్పుడు ఉన్నతమైన స్థితి అనుగ్రహించు ఆధారమని * కీడుకు ప్రతి కీడు చెయకూడదని   * దేవునికి నమకత్వంగా ఉండటం *మన కొరకు దేవుడు ఎన్నో మేలులు మూందుగానె సిద్దపరచాడని * మనలను పొషించు దేవుడని   
మోషే విశ్వాసము: మోషే తల్లితండ్రులు విశ్వాసమును బట్టి రాజాగ్నకు భయపడక మోషేను దాచిరి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భగ్యమని యొంచుకొన్నాడు. అల్ప కాలము పాప భొగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతొ శ్రమ అనుభవించుట మేలని యొచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలుగభొవు బహుమానమందు ద్రుష్టియుంచాడు. విశ్వాసమును బట్టి మోషే అద్రుశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్దిగలవాడై రాజాగ్నకు భయపడక ఐగుప్తును విడచిపొయెను. దేవుని ఇల్లాంతటిలో నమ్మకమైన వాడని మరియు భూమి మిద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని దేవుని చేత సాక్శ్యము పొందెను. విశ్వాసమునకు కలుగు పరిక్ష ఓర్పు పుట్టించునని యెరిగి నానా విధములైన శొధనలలో పడునప్పుడు అది మహనందమని యెంచుకొనుడి(యాకోబు 1 : 2,3). ఇంత గోప్ప సాక్షీ సమూహము మేఘమువలే మనలను ఆవరించియున్నందున మనము కూడ ప్రతీ భారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపములను వుడచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతొ పరుగెత్తుదము. ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి, సిలువను సహించెను( హెబ్రి 12 : 1,2)      
మోషే విశ్వాసమును నుండి ఏమీ నేర్చుకొంటున్నాము?
*విశ్వాసము ఉంటే భయముండదని * ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భగ్యమని * అల్ప కాలము పాప భొగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతొ శ్రమ అనుభవించుట మేలని * ప్రతిఫలముగా కలుగభొవు బహుమానమందు ద్రుష్టియుంచాలని *అద్రుశ్యుడైన దేవుని చూచు స్థిరబుద్దిగలవారమై ఉండాలని *దేవునికి నమ్మకమైన వారముగా ఉండాలని * సాత్వికంతొ నడచుకొవాలని      
 విశ్వాస విధములు :
V గోప్ప విశ్వాసముమత్తయీ 8 : 10; 15 : 28; లూకా 7 : 9
V ఆవగింజంత విశ్వాసములూకా 17 : 6; మత్తయీ 17 : 20  గట్టి విశ్వాసము
V అమూల్యమైన విశ్వాసము – 2 పేతురు 1 : 1
V నిత్యజీవమునిచ్చె విశ్వాసము – 1 యొహను 5 : 12; యొహను 3 : 16  
V రూఢియైన/ బలపరచె విశ్వాసము.కా. 3 : 16
V బాగుపరచె విశ్వాసముమత్తయీ 9 : 22
V విశ్వాస వాక్యము -రోమా 10 : 8
V హృదయములను పవిత్రపరచె విశ్వాసము - .కా.15 : 9
V అత్మ చెత ముద్రింపబడె విశ్వాసముఎఫెసీ 1 : 13  
V నీతిమంతులనుగా తీర్చే విశ్వాసమురోమా 3 : 26; గలతి 3 : 8
V దేవుని కుమారులయ్యె విశ్వాసముగలతి 3 : 26
V జీవింపచేసే విశ్వాసముహెబ్రి 10 : 38; హబక్కూకు 2 : 4    
V సిగ్గుపరచని విశ్వాసము – 1 పేతురు 2 : 6; రోమా 9 : 33  
V సందేహం లేని విశ్వాసముమత్తయీ 21 : 21; రోమా 4 : 20
V దేవుని శక్తియైన విశ్వాసము – 1 పేతురు 1 : 5
V భాగ్యవంతులను చేసే విశ్వాసముయాకోబు 2 : 5
V బహు ధైర్యము పుట్టించు విశ్వాసము – 1 తిమోతి 3 : 13
V అభివృద్దినిచ్చె విశ్వాసము ఫిలిప్పీ 1 : 26
V అనందమునిచ్చె విశ్వాసముఫిలిప్పీ 1 : 26
V విశ్వాసము చేత ధైర్యము నిర్బయమైన ప్రవెశముఎఫెసీ 3 : 12   
తిమోతి పత్రికలోని విశ్వాసి పొలికలు లక్షణాలు :  character

విశ్వాసికి ఉండవలసినవి/ ఉండే లక్షణాలు :
m  వినుట రోమా 10 : 17
m  గ్రహింపుహెబ్రి 11 : 3
m  విధెయత రోమా 1 : 6
m  అశానిగ్రహముహెబ్రి 11 : 24-26
m  బలము/ శక్తిహెబ్రి 11 : 11,34 ; .కా. 3 : 16; 1 పేతురు 1 : 5; రోమా 4 : 19,21     
m  ధ్యైర్యంఎఫెసి 3 : 12,13 ; 1 తిమోతి 3 : 13; మార్కు 4 : 40
m  దూర దృష్టి- హెబ్రి 11 : 24    
m  సహనం/ఓపిక యొబు 13 : 15; హెబ్రి 12 : 2; యాకోబు 1 : 2,3
m  స్వపరిక్ష – 2 కొరింథి 13 : 5 
m  సమాధానము - రోమా 15 : 13
m  సత్య విషమము అనుభవ జ్ఞానం – 1 తిమోతి 4 : 3; హెబ్రి 11 : 24-26   
m  సాక్ష్యం హెబ్రి 11 : 39 ; ప్రకటన 2 : 13
m  ప్రేమ- 1 కొరింథి 13 : 2,3; 2 థెస్స 1 : 3
m  పోరాటం - 1 తిమోతి 6 : 12; ఎఫెసి 6 : 16; 1 పేతురు 5 : 9    
m  విశ్వాసపు క్రీయలు/సత్ క్రీయలుయొహను 14 :12; 1 థెస్స 1:2; తీతు 3:8;
ఫిలెమోను 1 : 6; యాకోబు 2 : 20,26 (సేవ -1తిమోతి6 :2)     
m  స్థిరత్వం/ నిలకడ – 1 కొరింథి 13 : 13; కొలొస్సి 2 : 7; హెబ్రి 11 : 27; 1 పేతురు 5 : 9; 1 థెస్స 3 : 8; 2 దిన 20:20      
m  అభివృద్ది – 2 థెస్స 1 : 3; ఫిలిప్పి 1 : 26   
m  నమ్మకం - లూకా 22 : 32; యొహను 20 : 27; మార్కు 4 : 40;9 :23,24; మత్తయీ 21 : 22
m  నిస్సందెహంరోమా 4 : 20; మత్తయీ 21 : 21; మార్కు 11 : 23
m  నిస్సిగ్గు రోమా 9 : 33; 1 పేతురు 2 : 6
m  నిరీక్షణ కలిగి ఉండటం - రోమా 15 : 13; గలతి 5 : 5; హెబ్రి 11 : 1   
m  నిర్బయం - ఎఫెసి 3 : 12 ; హెబ్రి 11 : 23
m  నీతిరోమా 3 : 26,30; రోమా 5 : 1; గలతి 2 : 15; 3 : 8; ఫిలిప్పి 3 : 9; హెబ్రి 10 : 38       
m  శ్రద్దతీతు 3 : 8
m  రక్షణ కలిగి ఉండటంహెబ్రి 10 : 39 
m  రూఢితనం /నిశ్చయత రోమా 4 : 21
m 


లోక విషయములలో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చెసిన రాజ్యమునకు వారసులుగా దేవుడేర్పరచుకొనెను.      యాకోబు 2 : 5 

విశ్వాసము కాపాడుకొవటం – 2 తిమోతి 4 : 7; 1 థెస్స 5 : 8  



విశ్వాసికి ఉండకూడని లక్షణాలు :  
F విశ్వాసించువాడు కలవరపడకూడదుయెషయా 28 : 16
F విశ్వాసి సందేహింపకూడదు -మత్తయీ 21 : 21; మార్కు 11 : 23  
F విశ్వాసి భయపడకూడదు, అధైర్య పడకూడదుమార్కు 4 : 40; ఎఫెసి 3 : 13
F విశ్వాసి నమ్మిక తప్పిపొకూడదు- లూకా 22 : 32; యొహను 20 : 27; మార్కు 4 : 40
F విశ్వాసి సహనం/ ఒపిక  కోల్పొకూడదు- హెబ్రి 12 : 2  
F విశ్వాసి సిగ్గుపడకూడదు – 1 పేతురు 2 : 6     
F అల్ప విశ్వాసము ఉండకూడదుమత్తయీ 17 ; 20
F అవిశ్వాసితొ పాలు ఉండకూడదు. – 2 కొరింథి 6 : 15
F విశ్వాసి మూర్ఖచిత్తముగా ఉండకూడదుద్వితి 32 : 20
F క్రీయలు లేని విశ్వాసము నిష్పలముయాకోబు 2 : 20
F   క్రీయలు లేని విశ్వాసము మ్రుతము - యాకోబు 2 : 26
F కొండల్ని పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసమున్న ప్రేమలేనిచొ వ్యర్దము – 1 కొరింథి 13 : 3
ఇలాంటి వారి మధ్య విశ్వాసిగా జీవించు
A  విశ్వాస విషయమై ఒడ బద్దలై పొయీన వారి మధ్య – 1 తిమోతి 1 : 19 put away concerning Faith
A  విశ్వాస భ్రష్టులైన వారి మధ్య - 1 తిమోతి  4 : 2  Depart from the Faith
A  విశ్వాస త్యాగం చెసిన వారి మధ్య - 1 తిమోతి 5 : 8 Denied the Faith
A  విశ్వాసం వదులుకున్న వారి మధ్య - 1 తిమోతి 5: 12 cast off  their first Faith
A  విశ్వాసము నుండి తొలగిపోయిన వారి మధ్య - 1 తిమోతి 6 : 10 Erred from the faith  
A  విశ్వాస విషయములో తప్పిపోయిన వారి మధ్య - 1 తిమోతి 6 : 21 Erred concerning the Faith
A  విశ్వాసమును చెరిపివేసే వారి మధ్య - 1 తిమోతి 2 : 14,18   overthrow the Faith

                    విశ్వాస విషయములో బలహినమైన వారిని చెర్చుకొనుడి. – రొమా 14 : 1

యేసు- నమ్ముట నీ వలనైతె నమ్మువానికి సమాస్తము సాద్యమే- మార్కు 9 : 23   

 
 


              యేసు-  నేను చేయు క్రీయలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి    అతడు చేయనని మీతొ నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహను 14 : 12

2 comments:

  1. చాలా విపులముగా వివరించారు.మిమ్ములను దేవుడు ఇంకా బహు బలముగా జ్ఞానమిచ్చి ఆయన కొరకు వాడుకొనును గాక !

    ReplyDelete