Friday 3 July 2020

Bible Study on The Book of Jonah

యోనా గ్రంథ ధ్యానము 


1వ అధ్యాయము - తొలగిన యోనా 
దేవుని ఆజ్ఞ - నీనెవె కు దుర్గతి కలుగునని ప్రకటించామని
యోనా అవిధేయత - తర్షిషుకు పారిపోవుట
అవిధేయత పర్యవసానము - ఓడ బద్దలైపోయే తుఫాను రావడము
            - ఓడ వారికి శ్రమ
            - యోనాకు శ్రమ
తనను గూర్చి అడిగినప్పుడు - తన దేవుని దైవత్వమును, ఆ దేవునిపై తనకున్న విశ్వాసమును (సాక్ష్యం) పంచుకున్నాడు
 అన్యుల యెదుట తప్పును ఒప్పుకున్నా యోనా (కానీ దేవుని యెదుట పశ్చాత్తాప పడలేదు)
ఓడవారు రక్షించబడటానికి పరిష్కారమును ఎరిగియున్నాడు (వారితో పాటు తనను కూడా దేవుడు రక్షింప సమర్థుడని తెలుసు కానీ ఎందుకో నీనెవెకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అని అనుకుని ఎత్తి సముద్రములో పడవేయమన్నాడు/ చావనైన చస్తాను కానీ శత్రువుకు సువార్త ప్రకటించను అని బహుశ అనుకోని ఉండవచ్చు)
సముద్రములో పడవేయబడ్డాడు
గాలి తుపానులు నిమ్మళ మవుట - అన్యులు దేవున్నీ విశ్వాసముంచుట
గొప్ప మత్స్యమునకు దేవుని ఆజ్ఞ
గ్రహించవలసిన అన్వహించుకోవలసిన అంశాలు :
- దేవుని ఆజ్ఞకు విధేయత చూపాలి
- దేవుని యొద్ద నుండి ఎక్కడికి పారిపోలేమని గ్రహించాలి
- మనల్ని దారికి తెచ్చుటకు ప్రకృతి వాడుకుంటాడు
- మన అవిధేయతను బట్టి మనతో పాటు  ఉన్నవారు కూడా శ్రమపడతారు
- మనం చేసిన తప్పులను కప్పుకొనక ఒప్పుకోవాలి
- ఇతరులు మనల్ని గూర్చి అడిగినప్పుడు దేవున్ని పరిచయం చేసి మన విశ్వాసాన్ని, దేవుడు మనపట్ల చేసిన మేలులను(సాక్ష్యం) పంచుకోవాలి.
- ఆపద సంభవించినప్పుడు మొదట దేవునికి ప్రార్థించాలి అటు తర్వాత మన ప్రయ్నతాలు మనం చేయాలి (ఇక్కడ ఉన్న అన్యుల నుండి నేర్చుకోవల్సినది).
- మనము దేవుని ద్వారా పొందుకున్న మేలులను బట్టి అర్పణములు(కానుకలు) అర్పించి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి (ఇక్కడ ఉన్న అన్యుల నుండి నేర్చుకోవల్సినది).
- దేవునికి సముద్రము అందులోని జీవరాసులు చెట్లు పురుగులు లోబడుతున్నవి

2వ అధ్యయము - నలిగిన యోనా 
మత్స్యపు కడుపులో నుండి యోనా ప్రార్థన
యోనా పశ్చాత్తాపము
యోనా వేడుకోలు
దేవుడు యోనాను అంగీకరించుట
యోనా రక్షించబడుట
కృపకు ఆధారము దేవుడే అని జ్ఞాపకము చేసుకొనుట
బలియార్పణ మ్రొక్కుబళ్ల చెల్లింపు తీర్మానము
దేవుని యొద్దనే రక్షణ దొర్కుకునని వెల్లడిపరచుట
మత్స్యమునకు దేవుని ఆజ్ఞ
అగాథ సముద్ర నుండి నేల పైకి వచ్చుట
గ్రహించవలసిన అన్వహించుకోవలసిన అంశాలు :
 అపాయము/ఆపదలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి
దేవుడే కృపాధారము అని గ్రహించాలి
దేవుని యొద్దనే రక్షణ దొరుకునని గ్రహించాలి
మనం పొందుచున్న మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు అర్పణములు చెల్లించాలి

3వ అధ్యయము - వెలిగిన యోనా 
  రెండవ మారు  దేవుని  ఆజ్ఞ
యోనా విధేయత
యోనా ప్రకటన
నీనెవె వారు విశ్వాసముంచటం
నీనెవె పట్టణ మంతా (మనుష్యులు, జంతువులు) ఉపవాసముండుట
                 - దుర్మార్గతను విడచిపెట్టుట
                 - బలాత్కారములను మానివేయుట
                 - గోనె పట్ట కట్టుకొనుట
                  - ఆహారము, నీళ్లు పుచ్చుకొనకుండుట
                  - మనపూర్వకంగా వేడుకొనుట
దేవుని పశ్చాత్తాపాన్ని కోరుకున్న నీనెవె వారు
దుర్మార్గతను వదిలి వారు చేయుచున్న క్రియలను చూచి దేవుడు పశ్చాత్తాప పడుట
గ్రహించవలసిన అన్వహించుకోవలసిన అంశాలు :
- దేవుడు ఏదైనా రెండు సార్లు చెబుతున్నాడంటే అది చాలా ప్రాముఖ్యమైనదని గ్రహించాలి
- దేవునికి విధేయులమై దేవుడు చెప్పిన మాటలు చెప్పాలి
- దేవుని క్షమాపణను పొందుకొనుటకు మనము ఎలాంటి ఉపవాసము చేయాలో అర్థమవుతుంది
- మన చెడునతలను విడచినప్పుడు దేవుడు మనల్ని కరుణిస్తాడు

4వ అధ్యయము - అలిగిన యోనా 
చింతాక్రాంతుడై కోపగించుకున్నా యోనా
దేవున్ని ప్రశ్నిస్తున్న యోనా (నీవు సమస్తము చేయగల వాడవు నేను ఇక్కడికి రావడం అనవసమైనది )
యోనా నిరుత్సహం
యోనాకు దేవుని గుణపాఠం
నశించుచున్న వారిపట్ల దేవుని ప్రేమ
గ్రహించవలసిన అన్వహించుకోవలసిన అంశాలు :
- శత్రువులను ద్వేషించక ప్రేమించాలి
- మనం కష్టపడి చేయని వాటి విషమై చింతించకూడదు
- కష్టం వచ్చినప్పుడు ఒకలా నష్టం వచ్చినప్పుడు ఒకలా ఉండకూడదు
- దేవుడు అన్యజనులకును దేవుడే



Wednesday 12 February 2020

ప్రేమ

ప్రేమ

²  ప్రేమ దోషములన్నిటిని కప్పును  సామెతలు 10: 12
²  ప్రేమ మరణమంత బలమైనది  పరమ 8:6
²  ప్రేమ నిష్కపటమైనది  రోమా 12 :9
²  ప్రేమ పొరుగువానికి కీడు చేయదు  రోమా 13 : 10
²  ప్రేమ క్శెమాభివ్రుద్ది కలుగజెయును  1 కొరింథి 8: 1
²  ప్రేమ తన ప్రేమించిన వారి కార్యములు చేయుటకై ఒకనిని బలవంతపెట్టును  2 కొరింథి 5: 14
²  ప్రేమ యధార్థమైనది  2 కొరింథి 8: 8
²  ప్రేమ దీర్ఘకాలము సహించును
²  ప్రేమ దయచూపించును
² ప్రేమ మత్సరపడదు
²  ప్రేమ  డంబముగా ప్రవర్తింపదు
²  ప్రేమ  ఉప్పొంగదు
²  ప్రేమ అమర్యదగా నడవదు
²  ప్రేమ స్వప్రయొజనమును విచారించుకొనదు
²  ప్రేమ త్వరగా కొపపడదు
²  ప్రేమఅపకారమును మనసులో ఉంచుకొనదు
²  ప్రేమ దుర్నితి విషయం సంతొషపడక సత్యమందు సంతొషించును
²  ప్రేమ అన్నిటిని తళుకొనును లెక అన్నిటిని కప్పును
²  ప్రేమ అన్నిటిని నమ్మును   
²  ప్రేమ అన్నిటిని నిరీక్శించును
²  ప్రేమ అన్నిటిని ఒర్చును
²  ప్రేమ  శాశ్వాతకాలముండును      - 1 కొరింథి 13: 4-8 

Saturday 20 July 2019

సహవాసము


దేవునితో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. ఆలాగున నీకు మేలు కలుగును. యొబు 22: 21

 సహవాసము



 ప్రభువైన క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభువు నామమున మీ అందరికి నా  శుభాభివందనములు. గత కొన్ని నెలలుగా సమాధానము గూర్చి ధ్యానించుకొనుచున్నాము, అందులో దేవుని సమాధానము కలిగి ఉండాలంటే మనము ఏమేమి కలిగియుండాలో అని చెప్పుకున్నాము. వాటిలో గత మాసములలో విశ్వాసము ప్రార్థన వాక్యము వలన సమాధానము గూర్చి ధ్యానము చేశాము. మాసము సహవాసము వలన సమాధానము గూర్చి ధ్యానిద్దాం.
దేవుని సమాధానమునకు మనం కలిగి ఉండవలసినవి:   
1. విశ్వాసము- రోమ 5: 1  2.ప్రార్థన- ఫిలిప్పీ 4: 6,7     3. వాక్యం- యోహాను 16: 33    4. సహవాసము- యోబు 22: 21
5. హృదయ మందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుట- 1పేతురు 3: 15   6. దేవునిగూర్చి ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానము-2 పేతురు 1: 3   7. సమస్తశిక్షయందు అభ్యాసము- హెబ్రీ 12: 11
సహవాసము  (గ్రీకు- కొయినోనియ)  అంటే సమిష్టి కలిగియుండుట, పాల్గొనడం, పంచుకోవడం, ఐక్యత కలిగియుండుట మాటకున్న ఇతర అర్థాలు. క్రైస్తవ సహవాసంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వారికి ఒకే విశ్వాసం(1కొరింథి 1:10; తీతు 1:14), క్రీస్తునందు దేవుని ఒకే క్పప, ఒకే ఆత్మ వారిలో నివసించడం(2తిమోతి1:7), ఒకే ఆత్మ వరాలు(రోమ 15:27), ఒకే భొధ(యూదా 1:3), ఒకే శత్రువుతొ పోరాటం (1 యెహాను2:15-18, 1 పేతురు 5:8) అనేవి. కొత్త నిబంధన విశ్వాస సంబంధమైన భొధను తిరస్కరించె వారికి ఈలాటి నిజమైన సహవాసం లేదు. సహవాసంలో ఏకీభవించడం అనేది ప్రాథమికమైన ఆంశము.   
        నిజమైన మానవుని జీవితం సహవాసానికి దారితిస్తుంది. పరిశుద్ద గ్రంథ అధ్యాయనం, ప్రార్థన సమావేశాలు, ఆరాధన అనుభవాలు, సాక్ష్య జీవితం, మరియు అధ్యాత్మిక ధృవికరణ మరియు మద్దతును అనుభవించడం లాంటివి మనం సహవాసంలో చేయవలసిన ఆంశాలు. సహవాసమనగా సంఘములో కూర్చొని పనికిరాని లోక పరమైన ముచ్చట్లు కాదు, హస్యాస్పదమైన సంభాషణ అంతకన్న కాదు. ఆత్మీయంగా మనకు మేలు చేకూర్చే దైవికమైన విషయాలు పంచుకోవడం, ఒకరి అవసరతలో ఒకరము పాలుపంచుకోవడము, సాక్ష్య జీవితము, దేవుని చేసిన మేలులను పంచుకోవడము, ఒకరినొకరము ఒర్చుకొనుచు క్షమించుచు, ప్రేమ కలిగి, తోటివారి విశ్వాసములో  పాలివారగుచు, యేక భావము గలవారై, వినయ మనసుతొ యొకనినొకడు తనకంటే యోగ్యుడని యెంచుచు ఐక్యత కలిగి ప్రేమపూర్వకమైన ప్రవర్తన మరియు సొంత కార్యములనే కాక  ఇతరుల కార్యములను కూడా చూడవలెయును అనునవి సహవాసములోని ఇమిడి ఉన్న ఆంశాలు. ఇవి తోటి విశ్వాసులతొనే కాక దేవునితో మనం సహవాసము కలిగి ఉన్నామనడానికి రుజువులు. ఇట్టి వాటిని మనం కలిగియున్నమంటారా?. ఆలాగునున్న యెడల మనం మన వలే మన పొరుగువారిని ప్రేమించడం మరియు ప్రేమ జాలి దయ కనికరం పరిశుద్దత నిష్కల్మషం నిర్దొషత్వం నిందారాహిత్యం మొదలగు దేవుని గుణ లక్షణాలు కలిగి ఉన్న వారమై దేవునితో ఏకమై నడుస్తూ మన ఆలోచన ధోరణిని, దృష్టి ,మాట తీరు, నడవడికను పరిశుద్దముగా ఉండుటకు జాగ్రత్త పడుచుందుము.
ప్రభువు ప్రార్థన:    
తండ్రి నీవనుగ్రహించిన వారును(శిష్యులు) మనయందు ఏకమై యుండవలేయునని వారికొరకు మాత్రమే ప్రార్థించుట లేదు; వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరును ఏకమై యుండవలేయునని ప్రార్థించుచున్నాను. యొహాను 17: 21

 






ప్రభువు ప్రార్థనను బట్టి ఆయన మనమందరమును తండ్రియైన దేవునితోను ప్రభువుతోను ఒకరినొకరముగా ఏకమై ఉండవలెయునని ఆనాడే ప్రభువు మన కొరకై ప్రార్థన విజ్ఞాపన చేసిన విధానాన్ని జ్ఞాపమునకు తెచ్చుకొనుచు సహవాసము యొక్క ప్రాముఖ్యతను గుర్తిద్దాం. అందువలన మనకు మన సమస్త విషయములలో సమాధానము  కలుగును ఆలాగున మనకు మేలు కలుగును.
మన సహవాసమైతే
తండ్రియైన దేవునితో సహవాసము – 1 కొరింథి 7:24, 1 యొహను 1: 3
దేవుని కుమారుడైన క్రీస్తుతో సహవాసము – 1కొరింథి 1:9, 1 యొహను 1: 3  
దేవుని కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తు సహవాసమునకు పిలువబడిన వారము. 1 కొరింథి 1:9
పరిశుద్దాత్మ సహవాసము – 2 కొరింథి 13:14


యేసు క్రీస్తు సహవాసము:  Fellowship of Jesus Christ(1 కొరింథి 1:9)
ఈ దినాలలో విశ్రాంతి దినమైన ప్రభువు దినమును అకారణముగా దైవ భయము ఏమాత్రము లేకుండగా ఆశ్రద్ద చేస్తు మందిరమునకు రాకుండ క్రైస్తవులమని చెప్పుకొను వారు ఉన్నారు. ఎడవ దినమున సంఘముగా కూడుట అనే దైవ విధినే దిక్కరిస్తున్నారు. మరియు మందిరమునకు వచ్చినను అలక్శ్యముగా భక్తి యేమాత్రమును కలిగియుండక క్రైస్తవ సహవాసములో అతి ప్రాముఖ్యమైన ప్రభువు మరణ పునరుత్థానములను ప్రచురము చేయు ప్రభురాత్రి భోజనమును సహితము అనాలోచితముగా అందులోని ప్రాధాన్యతనే గుర్తించక యధార్థత అనేదే లేక పవిత్రముగా పాల్గొనే విషములో గ్రుడ్డివారుగా వినయవిధేయతలు అసలే లేక ప్రభువువచ్చు పర్యంతము వరకు జ్ఞాపకము చేసుకొనవల్సిన విషయాన్ని అయోగ్యముగా పుచ్చుకొనుచు అపరాధులమగుచున్నవారు లెరా? అవిధముగా లేకుండగా మనలను పరిక్షించుకున్న యెడల అందుమూలన కలుగు శిక్షావిధిని తప్పించుకొందుము. క్రీస్తుతో ఈ సహవాసమునకే మనము పిలువబడియున్నాము అనగా ప్రభువు రాత్రి భోజనమునకు ప్రాధాన్యతనిస్తూ పవిత్ర హృదయముతోను యధార్థ ప్రవర్తనతోను వినయము కలిగి కృతజ్ఞతపూర్వకముగా ప్రభువు వచ్చు పర్యంతము వరకు అందులో పాలుపంపులు పొందడము. ఇందును బట్తియే మనము దేవుని కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తు సహవాసమునకు పిలువబడినవారము. మనమెందుకొసం పిలువబడియున్నామో అలాగున లేనియెడల మనము పిలువబడిన వారిలో ఉన్నమని చెప్పగలమా?
సహవాస విధములు : -
§  అపొస్తలుల సహవాసము Fellowship of Apostles’. పొ. 2: 42
క్రీస్తును రక్షకుడిగా జీవానికి నడిపించేవాడిగా, ఆయన దేవుని కుమారుడిగా భూలోకమునకు వచ్చి సమస్త మానవాలి పాపం ప్రాయచిత్తార్థమై హింసించబడి దూషించబడి కొట్టబడి అనేక విధాలుగా శ్రమపెట్టబడి కలువరి సిలువలో ప్రాణమును అర్పించి గొప్ప విమోచన కలిగించి మూడవ దినమున తిరిగి లేచి తన యందు విశ్వాసముంచిన వారిని తిరిగి వచ్చి కొనిపొవుటకై పరమునకు ఎతేంచినవాడని. ఇవిధముగా ప్రభువైన యేసు క్రీస్తును ఎవరైతే నమ్మి బాప్తిస్మము పొందునో వాడు రక్శింపబడుననునదియు మరియు క్రీస్తు నందు విశ్వాసముంచిన వారికి నిత్యజీవార్థమైన మేలులు దాచియున్నయనునది అపొస్తలుల సహవాసము ఈ సహవాసములొ నీవు ఉన్నవా? నిన్ను నీవు ఉన్ననని మోసపరచుకొనుచున్నావా? మనలను మనం తీర్పు తీర్చుకున్న యెడల రాబొవు తీర్పు నుండి తప్పించబడుదుము.    
©     ఆత్మయందు సహవాసము Fellowship of the Spirit(ఫిలిప్పి 2:1-4):
మన ఆత్మ యందు సహవాసమైనను ఉన్నయెడల ఏక మనస్కులగునట్లు” * ప్రేమ కలిగి * యేక భావముగలవారుగా ఉండి * ఒక్క దానియందే మనస్సుంచుచు - కక్ష చేతకాక - వృదాతిశయము చేతనైనను ఏమియు చేయక * వినయ మనసు గలవారై యొకనినొకడు తనకంటే యోగ్యుడని యెంచుచుసొంత కార్యములనే కాక * ఇతరుల కార్యములను కూడా చూడవలెయును. సహవాసములో ఏకీభవించుట అనునది ప్రథమమైనది, అది ఉత్తమమైనదిగా ఉండాలంటే ప్రేమ కలిగిఉండాలని ప్రభువు కోరుచున్నాడు. మనవలే మన పొరుగువారిని ప్రేమించడం. తగ్గింపు స్వాభావంతో దిక్కులేనివారిని విధవరాండ్రను పెదలను మొదలగు వారిని ఆదుకోవడం మరియు  విశ్వాసమందు బలహినులైన వారిని బలపరచడం, ఐక్యత కలిగి శత్రువును ఎదిరించడం ఏకముగా కూడి ప్రభువు నామమును ఘనపరడం సహవాసములోని ప్రాధాన ఆంశాలు.    
S  క్రీస్తు శ్రమలలో పాలివారగు Fellowship of His Sufferings (ఫిలిప్పి 3: 10,11):
పౌలు-క్రీస్తు మరణ విషయమై సమాన అనుభవము గలవాడనై, ప్రభువు పునరుత్థాన బలము బలము ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడగుట యెట్టిదో ఎరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలు యెవిధముగా క్రీస్తు మరణ విషయమై సమాన అనుభవము గలవాడో, ఆయన శ్రమలలో పాలివారగుచు ఎరీతిగా సమస్తమును నష్టముగా ఎంచుకొనెనో గ్రహించుకొని అవిధముగా మన ప్రభువు శ్రమలలో పాలివారమవుదాము.    
C 
మాతో కూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన వినిన దానిని మీకును తెలియజెయుచున్నాము. 1 యొహాను 1:3
సత్య సహవాసము Fellowship of Truth (1 యొహను 1:3):




మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన వినిన దానిని మీకు తెలియజెయుచున్నాము. మన సహవాసమైతె తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతొ కూడాను ఉన్నది. దేవుని సత్య వాక్కును అందులోని మర్మయుక్తమైన ఆశిర్వాదములను మరియు మన జీవితాలలో చెసిన మేలులను ఇతర విశ్వాసులతొ పంచుకొనుట వలన అందరము ఆత్మీయముగా ఎదిగే సహవాసము కలిగి యుందుము. 
 
అయితే ఆయన వెలుగులోఉన్న ప్రకారము మనమును వెలుగులో నడచిన యెడల. మనము అన్యోన్యసహవాసము గల వారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములనుండి మనలను పవిత్రులుగా చేయును.1 యొహాను 1:7    
అన్యొన్య సహవాసము Fellowship one with another (1 యొహను 1:7) :






 దేవునితొ సహవాసం కలిగియున్న వారమని చెప్పుకొనుచు ఇంకను అంధకారమైన లోకంలో నడచినట్లైతె అబద్దమాడుచున్న వారముగా ఉంటాము సత్యాన్ని మనము జరిగింపము. ఇందువిషయమై జాగ్రత్త కలిగి జాగరుకులమై పరిశీలించుకుంటూ మనలను మనం తీర్పు తీర్చుకున్నయెడల చీకటి నుండి తప్పింపబడి, దేవుడు వెలుగులో ఉన్న ప్రకారముగా మనమును వెలుగులో నడచి అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతీ పాపమునుండి మనలను పవిత్రులుగా చేయును (1యొహాను 1:3, 6-7). దేవునిత సహవాసము కలిగిన వారు ఆయన కృపను అనుభవిస్తూ, ఆయన యెదుట పరిశుద్ద జీవితం గడుపుతారు. ఉమ్మడి ఆసక్తులు మరియు కార్యాచరణలో ఉమ్మడి భాగస్వామ్యం ఇది మనందరికి చెందిన మనం పంచుకొనే దైవ స్వాస్థ్యమును ప్రతిబింబిస్తుంది. ప్రేమ సహవాసము- 1 యోహను 4 :12; 13: 21, యోహను 15: 9, 10  నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన యందు నిలిచియున్న ప్రకారము మిరును నా ఆజ్ఞలు గైకొనిన యెడల నా ప్రేమ యందు నిలుచుదురు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మిరొకనినొకడు ప్రేమించవలెయును. దేవుని ప్రేమించు వాడు తన సహొదరుని కూడా  ప్రేమించవలెయునన్న ఆజ్ఞ ఆయన వలన పొందియున్నాము. విశ్వాస సహవాసము ఫిలెమొను 1: 6 – క్రీస్తును బట్టి మనయందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు మన విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయును. ఫలించే సహవాసముయోహను 15: 5 ద్రాక్షవల్లిని నేను తీగెలు మీరు, ఎవడు నా యందు నిలిచి
యుండునో వాడు బహుగా ఫలించును.   

ఎవరితో సహవాసము చేయకూడదు :
D  అన్యులతో సహవాసముయోబు 15:19, కీర్తనలు 106 : 35
D  మూర్ఖుల సహవాసముసామెతలు 13: 20
D  కోప చిత్తుడు/ క్రోధముగల వాని సహవాసముసామెతలు 22: 24
కయీను  శాపం సహవాసనికి దూరముగా ఉండటం
కీర్తనలు 37: 8 కోపము మానుము ఆగ్రహము విడచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము
D  ద్రాక్శారసము త్రాగువారి సహవాసముసామెతలు 23: 20
నోవహు ద్రాక్శారసము త్రాగిన కారణముగాకనానియులు
లోతుకు ద్రాక్శారసము త్రాగించిన కారణముగామోయబియులు అమ్మొనియులు
సామెతలు 20 :1 ద్రాక్శారసము వెక్కిరింతల పాలు చేయును మధ్యపానము అల్లరి పుట్టించును దానివశమైన వారందరు జ్గానము లేని వారు.
D  మాంసము హెచ్చుగా తినువారితో సహవాసముసామెతలు 23: 20
సంఖ్యా 11:4,10,18,20,32-34 ఇశ్రాయేలీయులు మాంసం కోరకు యెడ్చిరి కారణం వారి మధ్యనున్న మాంసాపేక్ష గల మిశ్రిత జన సహవాసము అందులకు దేవుడు కోపపడెను
D  దుర్జనుల సహవాసముసామెతలు 24 :1
2 తిమోతి 3: 13 అయితే దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపొవుచు అంతకంతకు చెడిపొవుదురు.
D  తుంటరుల సహవాసముసామెతలు 28: 7
D  రాజులను నసింపజెయు స్త్రీలతో సహవాసము- సామెతలు 31: 3
సంసొనుఫిలిష్తియుల స్త్రీన్యాయ 14: 3, గాజా వేశ్యన్యాయ 16: 1,దెలీలాన్యాయ 16: 4
D  అవిశ్వాసులతో సహవాసము – 2 కోరింథి 6:14
ఎవరితో సహవాసము చేయాలి :
C  జ్ఞానుల సహవాసముసామెతలు 13 :20
సామెతలు 15 :31 జీవార్థమైన ఉపదేశము అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును.
ఇద్దరు కూడియుండుట మేలు (ప్రసంగి 4:9):
ఇద్దరు ముగ్గురు కూడియున్న చోట ప్రభువు ఉండును (మత్తయీ 18:20):
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! (కీర్తనలు 133:1)
కలసి ఉండటంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎలాంటి సహవాసం లేకుండా జీవించాడానికి దేవుడు మనలను సృష్టించలేదు(అది 2:18). కుటుంబం బందువులు స్నేహితులు తోటి పని వారు ఇరుగుపొరుగు వారు ఇతర విశ్వాసులు అందించే ప్రేమ సహాయం సహాకారం మనకు ఎంతో అవసరం (.కా 2:42). అయితే ప్రతిదినం తండ్రి కుమార పరిశుద్దాత్మ దేవుని సహవాసం లేకుంటే ఇవి అసంపూర్ణంగానే ఉంటాయి(1కొరింథి 1:9; 2కొరింథి 13:14; ఫిలిప్పి 2:1). గనుక దేవుని రక్షణ సువర్తమానము విన్న మనం నమ్మి బాప్తిస్మము పొందిన వారము మాత్రమేకాక రక్షణను కొనసాగించడానికి దేవునితో సహవాసం శక్తినిస్తుంది జీవాన్ని నింపుతుంది. లోకంలో యాత్రికులమును పరదేశులమును నైయున్న మనము లోకం నుండి వెరై  నిజ దేవుని సహవాసం కలిగి దేవుని రాజ్య సంబందులముగా మార్చబడియున్నాము. మనది కాని ఈ లోకంలో మనం ఐక్యత కలిగి మనకు మార్గమైయున్న దేవునిత సత్సంబంధంత నడచుట మనకు అవసరమైయున్నది.    

క్రీస్తుతొ పెనవెసుకొన్న సహవాసం:
నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను (గలతి 2:20):
           క్రీస్తుతో తనకున్న సంబంధాన్ని పౌలు ప్రభువుతో పెనువేసుకున్న ఒక అత్యుత్తమ వ్యక్తిగత బాంధవ్యంగా భావించి అనుసరించాడు. ప్రభువైన యేసు క్రీస్తును ఎరిగి అతి సన్నిహితమైన విధానంలో ఆయన సహవాసన్ని, సామీప్యతను అనుభవించడమే పౌలు జీవితంలోని ఆకాంక్ష. క్రీస్తును వ్యక్తిగతంగా అంగీకరించి, దేవుని వాక్యంలో వెల్లడైన ఆయన మార్గం, స్వభావం, గుణాలను తెలుసుకోవడం, పరిశుద్దాత్మను వెంబడిస్తూ, విశ్వాసంతో, సత్యంతో, విధెయతతో ఆయన కార్యలకు స్పందించడం, మన పట్ల ఆయన ఆసక్తి, ఉద్దేశాలతో మనల్ని మనం అన్వయీంచుకోవడం. క్రీస్తునందు విశ్వసించె వారు తమ ప్రభువు మరణ పునరుత్థాన అనుభవాలకు అతి సన్నిహితంగా జీవిస్తారు. క్రీస్తుతో ఐక్యత అనేది విమోచన పొందిన క్రైస్తవుని నూతన వాతవరణం. విశ్వాసికి క్రీస్తులో ఒక సన్నిహిత సహవాసం ఉంటుంది. సంబందంలోనే విశ్వాసి జీవితం క్రీస్తు తనలో జీవిస్తున్నట్టుగా ఉంటుంది. క్రీస్తుతో వ్యక్తిగత సహవాసం అనేది క్రైస్తవ అనుభవంలో  ప్రాముఖ్యమైన విషయం. క్రీస్తుతో ఐక్యత విశ్వాసం ద్వారా దేవుని వరంగా మనకు లబిస్తుంది.
నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము (ఫిలిప్పి 1:21):       
         దేవుని సహవాసం ఆయన చిత్తాన్ని జరిగించడము తమ జీవిత ధ్యేయంగా జీవించే నిజ విశ్వాసులకు చావంటె భయముండదు. తమ దేవుని తప్ప వేరొకరికి మ్రొక్కమని చెప్పి అందుమూలాన రాజాగ్రహమునకు లోనై ఎడంతల వేడిమి గల అగ్ని గుండములో పడవేయబడిన షడ్రక్ మెషక్ అబెద్నగొ అనువారు పౌరుషము గలగి మరణ భయము లేని వారు,  వారు  దేవునితో తమ సహవాసాన్ని రుజువుపర్చారు ఎట్లనగా తాము సహవాసించిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక అగ్ని గుండములో నుండి రక్శించి వారితో కూడను నిలిచినయున్నాడు. వారి జీవితం పట్ల దేవునికి ఒక ఉద్ద్దేశ్యం ఉన్నదని వారికి తెలుసు. వారికి మరణం అంటే లోకంలో తన పని ముగించి , క్రీస్తుతో ఘనమైన జీవితాన్ని ఆరంభించే సమయం. ఇంగ్లాండు రాజైన ఎనిమిదవ హెన్రి తన ఆస్థాన బిషప్ లనిద్దరినిమిమ్ములను థేమ్స్ నదిలో విసరి వేయుదునుఅనెను. అందుకు బిషప్ లురాజా! మేము పరలొకానికి వేళ్ళవలెనని అశించుచున్నాము. అది జలమార్గమైన కావచ్చు, రొడ్డు మార్గమైన కావచ్చును. మార్గమైనను మాకు చింతలేదు. మేము పరలోకము చెరుటయే ప్రాముఖ్యముఅనిరి.  మనము బ్రతుకుట క్రీస్తు కొరకు అయితేనే మనకు లాభము లేదంటే అది సహించలేని తిరిగి పూడ్చుకొలేనంత నష్టము. మానవుడా మరణము తర్వాత కలుగు లాభనష్టముల గురించి ఆలచన చయుము. ప్రాణమున్నప్పుడ దానిని నీవు తెలుసుకొనుము క్షయమగు నీ శరీరము అక్షయతను ఏలాగున దరించుకొనున యొచించుకొనుము. క్రీస్తులో నీకు నిత్యజీవమని నీవు తెలిసికొంటివా? తెలిసికొన్నయెడల ఆయనతో నీ సహవాసము ఎట్టిది? ఆయనతో సహవాసము చేసిన వారు పామరులైనను పండితులైరి లోకములో జ్యొతులుగా వెలిగిరి, వారి భొధకు జనులు ఆశ్చర్యపడిరి.
నిత్య జీవితంలో మన సహవాసం :
వ్యక్తిగతంగా అధ్యాత్మిక జీవం కొరకు దేవునితో సహవాసము కలిగియుండుము. కుటుంబముగా వారిని రక్శించు వానిగా  ఇంటివారితోను ఇంటివారితో కలిసి దేవునితో సహవాసము చేయుట దేవుడు ఏర్పాటు చేసినది. ఇందులో ఏదిఎమైనను సమాజము ఏటుపొయీనను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అన్న కచ్చితమైన ప్రమాణము చెసున్నవారముగా, విశేషముగా తన సొంత యింటివారిని సంరక్శింపక పొయినయెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసికన్న చెడ్దవాడైయుండునన్న కఠినమైన మాటను మనస్సున ఉంచుకొనుచు, కుటుంబముగా మనము దేవుని సన్నిదిలో కనబడుదము. ఆలాగుననె ఇరుగుపొరుగు వారితోను వృత్తి జీవితంలో తోటి పని వారితోను  క్రైస్తవుడను అను మాటకు తగినట్లుగా క్రీస్తు ప్రేమ ప్రతిబింబించునట్లుగా యదార్థయును నిష్కల్మషమును నిష్పక్షపాతమును నీతివంతమును పరిశుద్దతయును అను వ్యత్యాసము వారు గ్రహించునట్లుగా ప్రేమ క్షమ హృదయము కలిగి వారితో సహవాసము చేయుట రక్షకుని వారికి పరిచయం చేసినట్లవుతుంది. క్రొత్త నిబంధనగా క్రీస్తు రక్తము ద్వారా ఏర్పాడినది సంఘ సహవాసము.  జీవముగల దేవుని సంఘంలో మన సహవాసము ఏలాగున ఉండవలెయునో  అనుదాని విషయమై మనం బహు జాగ్రత్త పడవలెయును ఏట్లనగా సంఘమను శరీరమునకు శిరస్సు క్రీస్తు కావున క్రీస్తును అధికారిగా కలిగియున్న మనము ఎట్లుండవలెయును.  మహానుభవము కలిగియున్న వారిగా, క్రీస్తు ఘనతను కీర్తించునట్లుగా, తండ్రియైన దేవునికి మహిమ తెచ్చునట్లుగా దేవ దూతలతో దేవుని సహదాసులమనునట్లుగా ఉండవలెయును. ఆత్మీయ ఆభివ్రుద్దికి క్రైస్తవ సహవాసమనేది అత్యవసరమైనది. మన ఆత్మీయ జీవితంలోని చాలా విషయాలు ఒకరితో ఒకరము సహవాసము కలిగి ఉండటంపైనె ఆధారపడి ఉన్నది. సంఘం సహవాసముయొహాను 17:21, .కా 2:42, హెబ్రి 10:25, 1 యొహాను 1:3, 2 తిమోతి 2:22. వ్యక్తిగతంగా మనం చేసే ఆరాధన కంటే సంఘముగా మనమందరము కలిసి చేసే ఏకమైన ఆరాధన దేవునికి బహు ఇష్టమైనది.
    మనము ఎందుకు దేవునితొ సహవాసము కలిగియుండాలి? :
F   ఎందుకంటే ఆయన మనకు తండ్రి మనలను సృజించిన వాడు - అది 1:26; 2:7 , యొబు 33:4, మత్తయి 6:9, గలతి 4:6-10, రోమ 8:15    
F   వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును సర్వాధికారియు దేవుడగు ప్రభువు గనుక - ప్రకటన 1:6
F   ఆయన ఉన్నతుడుకీర్తన 145:5
F   ఆయన ఉపకారికీర్తన 145:9, లూకా 6: 35
F   ఆయన ఉద్దరించువాడుకీర్తన 145: 14
F   ఉత్తముడు, యథార్థవంతుడు -కీర్తనలు 25: 8
F   మనకు సహయమును, కేడెమునై యున్నాడుకీర్తనలు 33:21
F   మనకు ఆశ్రయ దుర్గము, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహయకుడుకీర్తన 46:1
F   సర్వభూమికి మహారాజుకీర్తనలు 47:2
F   దేవుడు సదాకాలము మనకు దేవుడు, మరణము వరకు మనలను నడిపించువాడుకీర్తనలు 48:14
F   న్యాయకర్తకీర్తనలు 50:6
F   మన భారము భరించుచున్నవాడు, మనకు రక్షణ కర్త- కీర్తనలు 68:19   
F   మహ దయళుడుకీర్తన 145: 7
F   మహత్యం గలవాడుకీర్తన 145: 3
F   ప్రభావము గలవాడు- కీర్తన 145: 12
F   దీర్హ్గాయుషుకు మూలమై యున్నాడుద్వీతి 30:20
F   మనకు తోడై యుండువాడు- సంఖ్యా 14:9
F   నెమ్మది కలుగ జెయువాడుయెహొషువ 22:4
F   అందరి హృదయములను పరిశొదించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగిన వాడునై యున్నాడు – 1 దిన 28:9
F   శాశ్వతముగా సింహసనాసినుడై నిరంతరము రాజై యున్నాడుకీర్తనలు 9:7;  10:16
F    రక్శించుటకును, నశింపజెయుటకును శక్తిమంతుడుయాకోబు 4:12  
తండ్రిగా ప్రభువుగా అధికారిగా రాజుగా రక్షకునిగా యాజకునిగా కాపరిగా నాయకునిగా మంచి సమరయునిగా దేవునికిని మానవులకును మధ్యవర్తిగా విగ్నాపనకర్తగా నడిపించేవాడుగా విమొచకుడుగా ఇల అనేక విధములుగా మన ప్రభువైన యేసు క్రీస్తు మనకుండగా ఆయనతొ సహవాసము కలిగి ఉండటమనెది అత్యవసర కొనసాగింపు ప్రక్రియ.
  *సముద్రము* మత్తయి 8:24, *గాలి* మార్కు 4:39, *సూర్యుడు* యెహోషువ 10:12  *చంద్రుడు* యెహోషువ 10:12 *వర్షము*  1రాజులు17:1,18:1 *మంచు*  న్యాయా 6:37 *సింహాలు*  దాని 6:22 *కాకులు* 1రాజులు 17:4,6  *చేపలు*  యోనా2:10 *పశువులు పక్షులు* ఆది 7:8,9 *రోగాలు*  లూకా 4:39 *దయ్యాలు* మత్తయి 17:18 సమస్తమును ఆయనకు లొబడినవి ఆయన సర్వాధికారి ఆయనను ఆశ్రయీంచి సహవాసము చెయుట గొప్ప ధన్యకరము. 
దేవునితో సహవాసము కలిగియున్న వారి యొక్క రుజువు కలిగిన జయ జీవితము  :
🍀*హనొకు*360 సంవత్సరములు ఏక దాటిగా దేవునితొ సహవాసం చేశాడు ఫలితాన మరణము చూడకుండ దేవుని యొద్దకు కొనిపొబడ్డాడు, 🍀*నోవహు* నీతిపరుడును తన తరములో నిందారహితుడునై జలప్రలయం నుండి తప్పింప్ప బడ్డాడు, 🍀*అబ్రహాము* విశ్వాసులకు తండ్రి అయ్యాడు,🍀 *యాకోబు* మోసగాడు ఇశ్రాయేలుగా(దేవుని ప్రజగా) మార్చబడ్డాడు, 🍀 *యోసెపు* పరదేశంలో బానిసగా ఉండి  ప్రధాని అయ్యాడు,యవ్వనులకు మాదిరి 🍀*మోషే*  పారిపోయిన వాడు గొప్ప నాయకుడయ్యాడు, నా యీల్లంతటిలో నమ్మకమైనవాడని దేవుని చేత సాక్ష్యం పొదాడు 🍀యెహొషువ- దేవునితోనూ మోషేతోనూ సహవాసం చేశాడు తద్వారా ఇశ్రాయేలు ప్రజలను కనానుకు నడిపించి దానిని స్వతంత్రింపజెసుకొని వారికి పంచిపెట్టిన నాయకుడయ్యాడు, 🍀యోబుసాతానుకే సవాలుగా ఉన్నాడు, సాతానును ఒడించినవాడయ్యాడు, మునుపటికంటె రెండంతల దీవెనలు పొందినవాడు,🍀సముయేలు- పసిపిల్లవానిగా ఉన్నప్పుడు నుండి దేవునితో సహవాసం చేశాడు ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకునిగా, మరియు రాజ్యపరిపాలన పద్దతిని రూపొందించాడు, 🍀 దావీదు- మరువబడిన గొర్రెల కాపరి రాజుగా చేయబడ్డాడు, శ్రమలన్నిటిలోనుండి విడిపింపబడ్దాడు, నా హృదయానుసారుడని దేవుని చేత పెరోందాడు🍀 ఎలియా- నిజ దేవుని ఉనికిని రుజువు పర్చినవాడు, దేవుని యందు రోషముగలవారికి మాదిరి 🍀ఎలిషా- దేవునిత సహవాసం కలిగి ఉన్న వారికి వారి శత్రువుల నుండి విడిపించడానికి కనబడని దేవుని సైన్య సమూహం వారితో ఉంటుందని నిరూపించాడు 🍀దానియేలు ‌ - శత్రువుల చేత చేరపట్టబడి ప్రధానికాగలిగాడు, రాజాజ్ఞయైనను దేవుని సహవసమును విడువలేదు, సింహల బొనులో పడవెయబడినను హని జరుగలేదు, 🍀 షడ్రక్ మెషక్ అబెద్నగోనిజదేవుని ఆరాధించే విషయంలో చావుకైనను వెనుకాడినవారుకాదు, మండుచున్న అగ్ని గుండములో ప్రభువు వారితో నిలవడం సహవాసాకి రుజువైంది🍀అపొస్తలులు సుంకపు గుత్తదారుడు, వైద్యుడు, చేపలు పట్టువారు (విధ్యలేని పామరులు).... క్రీస్తుతొ సహవాస కారణాన వారు భూ లోకాన్ని తలక్రిందులు చేసెంత శక్తిమంతులయ్యారు సాక్ష్యం వారి సువార్త వలన ఉన్న క్రైస్తవుల, మనుష్యులను నిత్యజీవములనికి నడిపించటంలో బలమైన పనివారిగా మార్చబడ్డారు 🍀పౌలుమొదట క్రైస్తవ హంతకుడు అటు తర్వాత క్రీస్తు సహవాసిగా క్రైస్తవుడై హింస పొందుచు క్రైస్తవులందరికి క్రిస్తు తర్వాత మాదిరిగా నిలిచాడు.
మరియు నీ నా సంగతి ఏమిటి? దేవునితో సహవాసము కలిగి ఉన్న కారణాన ఎట్టి వారైనను వారిలో ప్రస్పుటమైన మార్పు అద్బుతమైన సమాధానము కనిపిస్తుంది. మరి నీ నా సంగతి ఏమిటి? ఏంటి ఈ సమాధానము అనుకుంటున్నావా? మరణమును తప్పక రుచి చూడవలసిన మనిషి మరణమే చూడకుండ కొనిపొబడటం, నాశనమునకు బదులుగా కృప పొందటం, విగ్రహారాధికుడు నిజ దేవుని ఆరాధికుడు కావడం, బానిసలు ఇతర మరియు శత్రు దేశాలలో ప్రధానులు కావటం, మరువబడిన వాడు రాజు కావటం, వ్యవసాయకులు  ప్రవక్తలు కావడం ఇది సమాధానము కాదంటారా?
కావున దేవుని సహవాసముతొ కలిగి ఉన్న మన సమాధానకరమైన జయ జీవితము ఏ విధముగా సాగుచున్నది?.
       
సహొదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి యుండవలెను. 1 కొరింథి 7:24